Molten Lava: బద్ధలైన అగ్నిపర్వతం.. భగభగమండే లావా ఎగిసిపడుతున్న దృశ్యాలు వైరల్‌

4 Mar, 2023 17:18 IST|Sakshi

అగ్నిపర్వతం నుంచి నిప్పులుగక్కుతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న లావా దృశ్యాలను ఓ ప్రకృతి ప్రేమికుడు కెమెరాలో బంధించాడు. ఎంతో మనోహరంగా కన్పిస్తున్న ఈ వీడియోనూ 'హౌ థింగ్స్ వర్క్' అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయగా అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్న ప్రపంచంలోని ఈ వీడియో ఎంత అద్భుతంగా ఉందో చూడండి అని హౌ థింగ్స్ వర్క్ రాసుకొచ్చింది.

అగ్నిపర్వతంలో ఘన రూపంలో లావా.. ఉష్ణోగ్రత 700 నుంచి 1200 డిగ్రీల సెల్సియస్‌కు చేరినప్పుడు ద్రవీభవించి నిప్పులుగక్కుకుంటూ బయటకు వస్తుంది. ఫ్లూయిడ్‌లా మారి ఉవ్వెత్తున ఎగిసిపడి ప్రవహిస్తుంది. ఇలాంటి దృశ్యాలు అత్యంత అరుదుగా కెమెరా కంటికి చిక్కుతాయి.

లావా ఉష్ణోగ్రత 700 నుంచి 1200 డిగ్రీల సెల్సియస్ కాగా.. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 5,600 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. అంటే లావా వేడి సూర్యుడి ఉపరితలంతో పోల్చితే ఐదింట ఒక వంతు కంటే ఎక్కువగానే ఉంటుందన్నమాట.

వాతావరణ మార్పుల కారణంగా భూతాపం విపరీతంగా పెరిగింది.. అగ్నిపర్వతాలు బద్దలు అవుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. 2021లో స్పెయిన్‌లో, 2022లో మెక్సికోలో ప్రాచీన అగ్నిపర్వతాలు బద్దలై పలువురు చనిపోయారు.
చదవండి: ఏడాదిలోగా రష్యా ఖజానా ఖాళీ.. పుతిన్‌కు షాకిచ్చిన వ్యాపారవేత్త!

మరిన్ని వార్తలు