మాదేశాన్ని కాపాడుకునేలా.. విస‍్తృత ఆయుధ సాయాన్ని అందించండి!

24 Mar, 2022 19:43 IST|Sakshi

Russian Phosphorus Bombs Were Used: ఉక్రెయిన్‌ పై రష్యా నిరవధికంగా గత మూడు వారాలకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. రష్యా ప్రపంచ దేశాల ఆంక్షలను, అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఖతరు చేయకుండా మరింతగా బాంబుల వర్షంతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఫాస్ఫరస్‌ వంటి ప్రమాదకరమైన బాంబులతో మరింతగా విరుచుకుపడిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌ స్కీ ఆవేదనగా చెప్పారు.

మళ్లీ ఈ భయానక విధ్వంసంలో పెద్ద ఎత్తున్న పిల్లలు, పెద్దలు మృతి చెందారని అన్నారు. పైగా రష్యా తన భయంకరమై ఆయుధ సంపత్తితో ఎలాంటి ఆంక్షలు లేకుండా యథేచ్ఛగా దాడి చేస్తోందని తెలిపారు. అందువల్ల తమకు విస్తృత ఆయుధ సాయాన్ని అందించాలని నాటోని కోరారు. ఉక్రెయిన్‌లోని నగరాలను ప్రజలను రక్షించుకునేందకు ఉక్రెయిన్‌కి ఆంక్షలు లేని సైనిక సహాయం అవసరం అని నొక్కి చెప్పారు.

ఇంతవరకు ఆయుధ సామాగ్రిని సమకూర్చిన పాశ్చాత్య సైనిక కూటమి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ...మీ యుద్ధ విమానాల్లో ఒక శాతం మాకు ఇవ్వండి. మీ ట్యాంకులలో ఒక శాతం ఇవ్వడం అని కోరారు. అంతేగాక రష్యా తమ దేశంలో ఫాస్ఫరస్‌ ఆయుధాలతో మోహరించిందని చెప్పారు. రష్యన్ దాడులను ఎదుర్కొనేలా దురాక్రమణకు గురికాకుండా తమ దేశాన్ని రక్షించుకునేందుకు విస్తృతమైన ఆయుధ సాయాన్ని అందించి ఉక్రెనియన్ల మరణాన్ని నిరోధించాలని నాటోకి విజ్ఞప్తి చేశారు.

(చదవండి: భారత్‌ ఆ నిర్ణయం తీసుకుంటే...నేను సంతోషకరమైన రాయబారిని అవుతా!)

మరిన్ని వార్తలు