టైమ్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా జెలెన్‌స్కీ

8 Dec, 2022 09:27 IST|Sakshi

న్యూయార్క్‌: ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2022’గా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీని ఎంపికచేస్తూ ఆయన ముఖచిత్రంతో టైమ్‌ మేగజీన్‌ తాజా సంచిక ప్రచురించింది. ఉక్రెయిన్‌లో, విదేశాల్లో చాలా మంది జెలెన్‌స్కీని హీరోగా అభివర్ణిస్తున్నారని పేర్కొంటూ ట్వీట్‌ చేసింది టైమ్‌ మేగజీన్‌. 

‘ఉక్రెయిన్‌ సహా విదేశాల్లో చాలా మంది వొలొదిమిర్‌ జెలెన్‌స్కీని హీరోగా అభివర్ణిస్తున్నారు. 2022లో ఏడాదిగా ప్రజాస్వామ్యం, ధిక్కారానికి ఓ చిహ్నంగా నిరూపించుకున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే రష్యా దాడులను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.’ అని పేర్కొంది.

ఇదీ చదవండి: ఫోర్భ్స్‌ కుబేరుల జాబితా: పాపం ఎలన్‌ మస్క్‌ అలా దిగజారి.. ఆ వెంటనే..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు