Wall Street Journal: ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ అదే!

21 Mar, 2023 17:12 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ బీజేపీ అని రచయిత వాల్టర్‌ రస్సెల్‌ మీడ్‌ తన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో అభిప్రాయపడ్డారు . పైగా దీన్ని చాలా తక్కువ మందే అవగతం చేసుకోగలరని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో పేర్కొన్నారు. బీజేపీ 2014, 2019 వరుస విజయాలతో అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీ అదే గెలుపును 2024లో రిపీట్‌ చేసి విజయపథంలోకి దూసుకుపోతుందని చెప్పారు. భారత్‌ అగ్రగామి ఆర్థిక శక్తగా ఎదుగుతుందని, జపాన్‌తోపాటు అమెరికా వ్యూహ రచనలో అగ్రగామిగా నిలుస్తుందని తన జర్నల్‌ ప్రచురణలో పేర్కొన్నారు.

భవిష్యత్తులో పెరుగుతున్న చైనా శక్తిని సమతుల్యం చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు వంటి వాటితో సంబంధం లేకుండానే భారత్‌లోని బీజేపీ తనదైన శైలిలో దూసుకుపోతోంది. భారతీయేతరులందరికీ బీజేపీ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర నుంచి అభివృద్ధి చెందుతుందన్న విషయం తెలియదని రచయిత మీడ్‌ అభిప్రాయపడ్డారు.

ఒకప్పుడు అస్పష్టమైన సామాజిక ఉద్యమంలా ఉండే బీజేపీని  సామాజిక ఆలోచనాపరులు, కార్యకర్తలు తమ కృషితో ఆధునికరణకు తగట్టుగా విలక్షణమైన హిందూ మార్గాన్ని రూపొందించి ఎన్నికల్లో గెలుపును అందుకుని ఆధిపత్యం వహించే స్థాయికి ఎదిగేలా చేశారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

చైనా కమ్యూనిస్ట్‌ వలే బిలియన్ల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న దేశాన్ని ప్రపంచ సూపర్‌ పవర్‌గా ఎదిగేలా చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇజ్రాయెల్‌లోని లికుడ్‌ పార్టీ మాదిరిగానే బీజేపీ కూడా కాస్మోపాలిటన్‌ , పాశ్చాత్య కేంద్రీకృత సాంస్కృతిక, రాజకీయ ప్రముఖుల ఆగ్రహానికి గురైనప్పటికీ వాక్చాత్యుర్యం, సంప్రదాయవాద విలువలతో కూడిన ఆర్థిక వైఖరిని మిళితం చేస్తోందని మీడ్‌ అన్నారు. 

భారత్‌లోని ఈశాన్య ప్రాంతంలో క్రైస్తవులు అధికంగా ఉన్నరాష్ట్రలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి విజయకేతనం ఎగరువేయగలిగిందని తెలిపారు.. అంతేగాదు భారత్‌లో అతిపెద్ద రాష్ట్రమైన ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం షియా ముస్లింలు నుంచి బలమైన మద్దతు పొందినట్లు తెలిపారు.

గ్రామీణ, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు నుంచి మతపరమైన విద్య వరకు అన్ని పనులను ఆయా వర్గాల నుంచి వచ్చిన వాలంటీర్లచే నిర్వహించేలా చేసి ప్రజల శక్తిని తనపై కేంద్రీకరించేలా చేసుకుని విజయం సాధించింది బీజేపి అని రచయిత మీడ్‌ తన జర్నల్‌ వివరించారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్‌ యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో సహా అంతా మెదీ వారసులుగానే మాట్లాడతారని అన్నారు. ఏదీ ఏమైన అట్టడుగున ఉన్న ఉద్యమానికి చెందిన నాయకత్వం అత్యంత శక్తిమంతంగా ఎదగాలని ఆ స్థానాన్ని నిలబెట్టకోవాలని బలంగా కోరుకుంటోందని రూడ్‌ తన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

(చదవండి: మనీష్‌ సిసోడియాకు మరోసారి చుక్కెదురు..బెయిల్‌ విచారణ వాయిదా..)

మరిన్ని వార్తలు