దక్షిణ కొరియాలో భారీ అగ్నిప్రమాదం

9 Oct, 2020 17:39 IST|Sakshi

సియోల్‌ : ద‌క్షిణ కొరియాలోని ఉల్సాన్ న‌గ‌రంలో ఉన్న 33 అంత‌స్తుల బిల్డింగ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. కాగా ఈ ఘటన గురువారం రాత్రి 11గంటలకు జరిగినట్లు తెలుస్తుంది. కాగా బిల్డింగ్‌లోని 12వ అంత‌స్తులో మంట‌లు వ్యాపించి.. 8వ ఫ్లోర్‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నది.. ఎంత మంది మరణించారన్న దానిపై ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే మంట‌లు భారీగా ఎగిసిప‌డ‌డంతో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కొంతమంది బిల్డింగ్ పైఅంత‌స్తుకు వెళ్లారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కాగా గాలులు బ‌లంగా వీచ‌డం వ‌ల్లే ఒక బ్లాక్‌ నుంచి ఇంకో బ్లాక్‌కు మంట‌లు వేగంగా వ్యాపించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. కాగా ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ 88 మందిని  ఆసుపత్రికి తరలించారు. కాగా కోటి ప‌ది ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న ఉల్సాన్ న‌గ‌రంలో గత ఏప్రిల్‌లోనూ ఇదే తరహాలో  అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్ర‌మాదం కారణంగా సుమారు 38 మంది మ‌ర‌ణించారు. 

మరిన్ని వార్తలు