పాకిస్తాన్‌లో వరుస సిలిండర్ల పేలుడు; వీడియో వైరల్‌

29 Jun, 2021 21:06 IST|Sakshi

లాహోర్‌: పాకిస్థాన్‌లోని లాహోర్ సిటీలో మంగళవారం భ‌యాన‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. నగరంలోని బ‌ర్కత్‌ మార్కెట్‌లో భారీ సంఖ్యలో గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో ఒక్కసారిగా బర్కత్ మార్కెట్‌ దద్దరిల్లింది. ఈ పేలుళ్ల ధాటికి మార్కెట్‌లో పెద్దసంఖ్యలో దుకాణాలు ధ్వంసమైన‌ట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ సిలిండ‌ర్ల పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సిలిండ‌ర్లు పేలడంతో భారీగానే ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

చదవండి: ఆ అడవి మహిళలకు మాత్రమే.. మగవాళ్లు వస్తే ఇక అంతే!

డ్రోన్‌తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు