Afghanistan Crisis: ప్లేట్ భోజనం ఖరీదు రూ.7 వేల పైనే!

27 Aug, 2021 18:18 IST|Sakshi

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగడానికి ఆగస్టు 31 గడువు సమీపిస్తున్నందున కాబూల్ విమానాశ్రయం వెలుపల పరిస్థితి రోజు రోజుకి మరింత క్షీణిస్తూనే ఉంది. విమానాశ్రయం వెలుపల అనేక మంది ఆఫ్ఘన్లు దేశం నుంచి పారిపోవడానికి విమానాశ్రయానికి వస్తున్నారు. కాబూల్ విమానాశ్రయం లోపలికి వెళ్ళడానికి ప్రజలు విమానాశ్రయం పక్కన ఉన్న మురికి కాలువలో నిలిచి ఉంటున్నారు. అయితే, ఆ ప్రాంతం దగ్గర రద్దీ రోజు రోజుకి పెరిగిపోతుంది. 

కాబూల్ విమానాశ్రయ ప్రాంగణం సమీపంలో ఉన్న ఆహార, నీరు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాయిటర్స్ వీడియో ప్రకారం.. విమానాశ్రయం వెలుపల ఉన్న ఆఫ్ఘన్ జాతీయుడు తన దగ్గర నీటి బాటిళ్లను 40 డాలర్లకు(దాదాపు రూ.3,000) విక్రయిస్తున్నట్లు తెలిపారు. కాబూల్ విమానాశ్రయంలో ఆహారం & నీటి బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్న వీడియోను రాయిటర్స్ పంచుకుంది. "ఒక బాటిల్ నీటిని 40 డాలర్లకు, ఒక ప్లేట్ బోజనాన్ని 100 డాలర్ల(రూ.7,375)కు విక్రయిస్తున్నారు. ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు" అని ఆయన అన్నారు. మరోవైపు, తాలిబన్ పాలన నుంచి పారిపోవడానికి వేలాది మంది ఆఫ్ఘన్లు కాబూల్ విమానాశ్రయం గేట్ల వద్ద ఇంకా వేచి చూస్తున్నారు.(చదవండి: అఫ్గాన్‌లను చంపడం ఆపండి ప్లీజ్‌.. రషీద్‌ ఖాన్‌ ఉద్వేగం)

>
మరిన్ని వార్తలు