మీ కోసం తెచ్చిన కేక్‌ పక్కోడు కట్‌ చేస్తే ?.. అచ్చం ఇలాగే ఉంటుంది కదూ!

25 Aug, 2022 12:07 IST|Sakshi

మీ బర్త్‌డే కేక్‌ పక్కోడు కట్‌ చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ జరిగింది కూడా అదే. చిత్రంలోని హేలీ అనే ఆమె తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లింది. వేదిక మీద వెడ్డింగ్‌ కేక్‌ ఉంది. అదేంటి.. వధూవరులు కేక్‌ కట్‌ చేసి.. అతిథులకు ప్లేట్లల్లో ఇవ్వడం మరిచి­పోయా­రనుకుని.. కత్తి తీసుకుని.. కేక్‌ను కట్‌ చేసింది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మీరు ఊహించుకోవచ్చు.  ఆ కేక్‌ కటింగ్‌ వీడియోను హేలీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

‘ఇది నా ఫ్రెండ్‌ పెళ్లి. వధూవరులకు నా క్షమాపణలు. నిజానికి వాళ్లు కట్‌ చేయడం మర్చిపోయారనుకుని నేను కట్‌ చేశాను’ అంటూ వివరణ ఇచ్చుకుంది. వైరల్‌ అవుతున్న వీడియోపై కొందరు నెటిజన్స్‌ ఫన్నీగా స్పందిస్తే మరికొందరు సీరియస్‌ అయ్యారు. పెళ్లి కూతురు మాత్రం ‘నేను క్షమించాను.. పెళ్లిలో ఎలా ఉండాలో మర్యాద కూడా నేర్పించాను’ అని కామెంట్‌ చేసింది.  

మరిన్ని వార్తలు