జాలర్లకు జాక్​పాట్:​ దరిద్రం పోయి ఊరు బాగుపడింది

3 Jun, 2021 14:24 IST|Sakshi

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాగే ఆలస్యం చేస్తే ఆ అదృష్టం అందకుండా పోవచ్చు కూడా. కానీ, యెమెన్​లో కొందరు జాలర్లు అదృష్టాన్ని అమాంతం ఒడిసి పట్టుకున్నారు. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించారు. ఆ దక్కిన దానితో  ఊరును బాగుచేసేందుకు ఖర్చు చేస్తున్నారు కూడా. 

యెమెన్​: చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన జాలర్ల గుంపుకి జాక్​పాట్ తగిలింది. చనిపోయిన ఓ భారీ తిమింగలం కడుపు నుంచి విలువైన వస్తువును వెలికి తీశారు. దీంతో అది వాళ్ల తలరాతనే మార్చేసింది. అల్-ఖైసా గ్రామానికి చెందిన కొందరు జాలర్లకు గల్ఫ్​ ఆడెన్​ సమీపంలో చేపల వేటకు వెళ్లారు. ఆ టైంలో చచ్చిన భారీ తిమింగలం కళేబరం సముద్రంపైన తేలుతూ కనిపించింది. వెంటనే 35 మంది జాలర్లు.. ఆ కళేబరాన్ని అతికష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చారు. చివరికి దాన్ని చీల్చగా.. అత్యంత విలువైన అంబర్గ్రిస్ బయటపడింది. 

సముద్రపు బంగారం 
అంబర్గ్రిస్​ అంటే తిమింగలం వాంతి. తిమింగలం జీర్ణించుకోలేని వాటిని కడుపులో ఘన పదార్థంగా మైనపు పదార్థం రూపంలో నిల్వ ఉంచుకుంటుంది. ఒక్కోసారి వాంతి రూపంలో వెలువడి నీళ్లలో తేలుతుంది. లేదంటే చనిపోయాక(వేటాడతారు కూడా) దాని కడుపు నుంచి బయటకు వస్తుంది. దీనిని సెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. కాబట్టే భారీ డిమాండ్​ ఉంటుంది. ఇక యెమెన్​ జాలర్లకు స్పెర్మ్​ వేల్ కడుపులో 127కేజీల బరువు అంబర్గ్రిస్​ కనిపించింది. అది విలువైందని వాళ్లకు తెలుసు. కాబట్టి ఓ దుబాయ్​ డీలర్​ సాయంతో మార్కెట్​లో దాన్ని అమ్మేశారు. అంబర్గ్రిస్​ అమ్మేయాగా సుమారు రూ.10కోట్లు సొమ్ము వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సొమ్మును ఆ 35 మంది పంచుకోవడంతోనే ఆపకుండా.. తమ కమ్యూనిటీలోని మరికొందరికి ఆర్థిక సాయం చేశారు. ఊరును బాగు చేసుకున్నారు కూడా.  ఇక సువాసన వెదజల్లే అంబర్గ్రిస్​కి చైనా, జపాన్, ఆఫ్రికా, అమెరికా, గ‌ల్ప్ దేశాల‌ ప‌ముద్ర‌ తీరాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఆ జనవరిలో థాయ్​లాండ్​లో 20 ఏళ్ల ఓ కుర్రాడికి అంబర్గ్రిస్​ ముద్ద దొరకడంతో కోటీశ్వరుడు అయ్యాడు.

చదవండి: పోర్న్​ తీయాలనుకున్న ఆ స్టార్​ దర్శకుడెవరు?

మరిన్ని వార్తలు