ఆన్‌లైన్‌ క్లాసుల్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో?

18 Sep, 2020 19:31 IST|Sakshi
వీడియో దృశ్యాలు

న్యూయార్క్‌ : కొన్నికొన్ని సార్లు క్లాసులో సారు పాఠాలు చెబుతున్నపుడు.. వారు చెప్పేది నచ్చకో.. బుర్రకు ఎక్కకో నిద్రలో మునిగితేలుతుంటారు కొంతమంది. నిద్రను ఆపుకోలేక, పాఠం చెప్పే గురువువైపు పూర్తిగా కళ్లు తెరిచి చూడలేక తెగ ఇబ్బంది పడిపోతుంటారు. లైవ్‌ పరిస్థితే ఇలా ఉంటే ఇక ఆన్‌లైన్‌ క్లాసుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన క్లాస్‌ రూం నిద్రకు సంబంధించిన జ్ఞాపకాల్ని గుర్తు చేసేలా ఉండే ఓ చిన్నారి వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొద్దిరోజుల క్రితం అమెరికాకు చెందిన ప్రముఖ హాస్య నటుడు టోనీ బేకర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశారు. ( నన్ను సంపేయ్‌ సారు‌: ఈ బుడ్డోడు మామూలోడు కాడు )

ఆ వీడియోలో.. ఓ చిన్నారి నిద్రపోతుంటుంది. ఓ వ్యక్తి  ఏవో విషయాలు చెబుతుంటాడు.  పాప నిద్రపోతుందని గమనించి లేపుతాడు. పాప కళ్లు తెరిచి అతడివైపు చూసి నవ్వుతుంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ నిద్రపోతుంది. ఆ వ్యక్తి మళ్లీ పాపను నిద్రలేపుతాడు. నిద్రలేచిన చిన్నారి ఓ చిరునవ్వు నవ్వి మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది. సెప్టెంబర్‌ 8న పోస్టయిన ఈ వీడియో ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా వ్యూస్‌ సంపాదించుకుంది.

ME IN COLLEGE!!!!!! The struggle was real. Video by @comediantommyblack #tonybakervo 10 NEW VOICEOVERS DAY.

A post shared by Tony Baker (@tonybaker) on

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా