Uncombable Hair Syndrome: దువ్వెన మాట వినదు!  

1 May, 2022 17:12 IST|Sakshi

ఫొటో చూడండి. పిల్లాడి జుట్టు గమ్మత్తుగా ఉంది కదా. ఏ హెయిర్‌ స్టైలిస్టో కానీ భలే పనిమంతుడు.. బాగా సెట్‌ చేశాడు అనుకుంటున్నారు కదా. కానీ ఇది మనుషులు సెట్‌ చేస్తే వచ్చేది కాదు. వెంట్రుకలకు వచ్చే వ్యాధి వల్ల జుట్టు ఇలా తయారైంది. దీన్ని అన్‌ కోంబబుల్‌ హెయిర్‌ సిండ్రోమ్‌ (యూహెచ్‌ఎస్‌) అంటారు. జన్యుప రమైన సమస్యలతో ఇలాంటి సమస్య వస్తుంటుంది. ప్రతి పది లక్షల మందిలో ఒకరికి ఇలాంటి సమస్య ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముఖ్యంగా 3–12 ఏళ్ల చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. ఈ సమస్య ఉన్న వాళ్ల జుట్టును ఎంత దువ్వినా చెప్పిన మాట వినదు. పొలుసులుగా నిటారుగా నిలబడి ఉంటుంది. మెల్లమెల్లగా రాలిపోతుంటుంది. ఇలాంటి వాళ్ల జుట్టులో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. మామూలు మనుషుల వెంట్రుకల మొనలు స్థూపాకారంలో ఉంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ల వెంట్రుకలు త్రిభుజాకారంలో మారిపోతాయి.
చదవండి👉ఆరేళ్లుగా తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. 10 ఏళ్లు యవ్వనంగా..

అందుకే దువ్వెనతో కూడా దువ్వలేనంతగా వింతగా, అడ్డదిడ్డంగా పెరుగుతాయి. జన్యుపరమైన మార్పు వల్ల కొందరిలో చర్మం, పళ్లు, గోర్లకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ప్రస్తుతానికైతే ఈ వ్యాధికి చికిత్స అంటూ ఏం లేదు. అయితే కొందరు పిల్లల్లో బయోటిన్‌ వాడటం వల్ల కొంత మార్పు కనిపిస్తోందని.. మరికొందరిలో వయసు పెరుగుతున్నాకొద్దీ సమస్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు