మరో రెండు కోవిడ్‌ ఔషధాలకు డబ్ల్యూహెచ్‌ ఆమోదం

15 Jan, 2022 04:18 IST|Sakshi

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ రోగులకు చికిత్స అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు ఔషధాలకు ఆమోద ముద్ర వేసింది. రుమటైడ్‌ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్‌ కంపెనీ మోనో క్లోనల్‌ యాంటీబాడీ థెరపీలను కోవిడ్‌ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు అంగీకరించారు.

లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్‌ ఔషధం కరోనా తీవ్రంగా సోకిన వారి ప్రాణాలు కాపాడుతుందని, వారికి వెంటిలేటర్‌ అవసరం లేకుండా చేస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. స్టెరాయిడ్స్‌తో పాటు కీళ్ల నొప్పులకు వాడే ఈ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే బారిక్టినిబ్‌ను అమెరికా, యూరప్‌లలో గత ఏడాది మే నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరే అవసరం ఉన్న వారికి గ్లాక్సో కంపెనీకి చెందిన మోనోకల్నల్‌ యాంటీబాడీ ట్రీట్‌మెంట్‌ ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు