ఇండియన్‌ కోవిడ్‌ స్ట్రెయిన్‌ ఆందోళనకరం: డబ్ల్యూహెచ్‌ఓ

11 May, 2021 13:58 IST|Sakshi

జెనీవా: భారత్‌లో బయటపడిన కరోనా వైరస్‌ బి-1617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళనకరమైన స్ట్రెయిన్‌గా వర్గీకరించింది. ఇండియన్‌ స్ట్రెయిన్‌పై పరిశోధనలు చేస్తున్నామని, బి-1617 వ్యాప్తి గురించిన వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్‌-19 సాంకేతిక విభాగం చీఫ్‌ డాక్టర్‌ మారియా వాన్‌ కెర్‌కోవ్‌ సోమవారం మాట్లాడుతూ.. ‘ ఇండియన్‌ వేరియంట్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ల్యాబ్‌ టీం, ఎపీ టీం పరిశోధనలు చేస్తోంది. ఈ వైరస్‌ గురించి మాకు అవగాహన ఉంది. స్థానికంగా, ఇతర దేశాల్లో భారత స్ట్రెయిన్‌పై చేస్తున్న అధ్యయనాలు పరిశీలిస్తున్నాం. 

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం దీని వ్యాప్తి ఎక్కువగానే ఉంది. కాబట్టి దీనిని ఆందోళకరమైన వేరియంట్‌గా వర్గీకరిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. ‘‘ఈ వేరియంట్‌ గురించి మరింత సమాచారం సేకరించాల్సి ఉంది. జన్యుక్రమాన్ని విశ్లేషించాల్సి ఉంది. భవిష్యత్తులో మరిన్ని వేరియంట్లను చూడాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత మేరకు వైరస్‌ వ్యాప్తి అడ్డుకట్ట వేస్తూ, అది తీవ్రరూపం దాల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతంగా కూడా ఎవరికి వారు సురక్షితంగా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి’’ అని ఆమె పేర్కొన్నారు. 

చదవండి: పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌.. అమెరికా కీలక నిర్ణయం

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు