స్వీయ నిర్బంధంలోకి డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌

2 Nov, 2020 10:13 IST|Sakshi

జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి ప్రకంపనలు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్  గెబ్రెయేసెస్‌ను తాకాయి.  వైరస్ బారిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదని తెలిపారు.  అయినా కానీ డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని రోజుల పాటు తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటూ, ఇంటినుంచే కార్యకలాపాలను నిర్వహించనున్నానని చెప్పారు.

కాగా  ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 68 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డాడు. 12 లక్షల మందికి పైగా మరణించారు.  దేశంలో గత 24 గంటల్లో 46964 కొత్త కోవిడ్-19 ఇన్ఫెక్షన్లతో భారతదేశంలో మొత్తం కేసులు 81,84083 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,22,111 కు పెరిగిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు