వూహాన్‌ మార్కెట్లో డబ్ల్యూహెచ్‌ఓ బృందం

1 Feb, 2021 03:18 IST|Sakshi

బీజింగ్‌/వూహాన్‌:  కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల నిపుణుల బృందం ఆదివారం చైనాలోని వూహాన్‌లో ఉన్న హూనన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ను పటిష్టమైన భద్రత మధ్య సందర్శించింది. 2019లో కరోనా వైరస్‌ ఇక్కడే తొలిసారిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందన్న విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ మార్కెట్‌లో సముద్ర ఉత్పత్తులతోపాటు రకరకాల జంతువుల మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ విక్రయించే గబ్బిలాలు/పాంగోలిన్స్‌ నుంచే కరోనా వైరస్‌ పుట్టిందన్న వాదన ఉంది. అయితే, దీన్ని చైనా ప్రభుత్వం అంగీకరించడం లేదు. తాము ఈరోజు ముఖ్యమైన ప్రాంతాన్ని సందర్శించామని నిపుణుల బృందం తెలియజేసింది. కరోనా వ్యాప్తిని గుర్తించడానికి ఈ పర్యటన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. 2019 డిసెంబర్‌లో వూహాన్‌లో కరోనా కేసులు బయటపడిన తర్వాత ఈ మార్కెట్‌ను మూసివేసి, శుభ్రం చేశారు. 

మరిన్ని వార్తలు