మంకీపాక్స్‌: 20 దేశాల్లో 200 కేసులు.. కమ్యూనిటీ స్ప్రెడ్‌ చెందొచ్చు, కానీ..-డబ్ల్యూహెచ్‌వో

28 May, 2022 08:20 IST|Sakshi

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో సుమారు 200 మంకీపాక్స్‌ కేసులు బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. అయితే మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని ప్రకటించింది. ఈ మేరకు సీనియర్ మహిళా ప్రతినిధి ఒకరు శుక్రవారం మంకీపాక్స్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం ఉన్న తరుణంలో మంకీపాక్స్‌ కట్టడికి అవసరమైన సాయం అందజేస్తామని ఆమె పలు దేశాలకు హామీ ఇచ్చారు. అయితే.. కరోనా వైరస్‌లా మంకీపాక్స్‌ ప్రభావం చూపించే అవకాశాలు ఏమాత్రం లేవని ఆమె అన్నారు. 

మంకీపాక్స్‌ అంటువ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. ప్రపంచదేశాలు తమ వద్ద పరిమితంగా టీకాల, ఔషధాలను పంచుకునేందుకు ఒక నిల్వ కేంద్రాన్ని రూపొందించుకోవాలని ప్రతిపాదించింది.

మరిన్ని వార్తలు