కరోనా: ఐవర్‌మెక్టిన్‌పై కీలక సూచనలు చేసిన డబ్యూహెచ్‌వో

11 May, 2021 15:29 IST|Sakshi

జెనీవా: నోటి ద్వారా తీసుకొనే యాంటీ పారాసైటిక్‌ మెడిసిన్‌ ఐవర్‌మెక్టిన్‌ ను తీసుకోవడం ద్వారా కరోనా సోకే ముప్పు బాగా తగ్గుతోందని, కరోనా రోగుల్లో మరణ ముప్పు కూడా తగ్గుతున్నట్లు పరిశోధనలో తేలింది. దీనికి సంబంధించిన వివరాలను అమెరికా జర్నల్‌ ఆఫ్‌ థెరప్యూటిక్స్‌ వెల్లడించింది.కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్‌ను వాడేలా చర్యలు తీసుకోవాలని గోవా ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే సూచనలు చేశారు.

తాజాగా కోవిడ్‌ చికిత్సలో ఐవర్‌మెక్టిన్‌ మెడిసిన్‌ను వినియోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఏదైనా కొత్త వ్యాధికి వాడే మెడిసిన్‌కు కచ్చితమైన భద్రత, సమర్థత కలిగి ఉండాలని డబ్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ డా. సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. ఈ మెడిసిన్‌ను కేవలం కోవిడ్‌పై జరిపే క్రినికల్‌ ట్రయల్స్‌లో మాత్రమే వాడాలని సూచించారు.

కాగా ఈ ఏడాది జనవరిలో ఐవర్‌మెక్టిన్‌ మెడిసిన్‌పై మొత్తం 27 కంట్రోల్‌ ట్రయల్స్‌ జరిపామని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పియరీ కోరీ తెలిపారు. మొత్తం 2,500 మంది రోగుల మీద ఈ మెడిసిన్‌ను పరీక్షించామని పేర్కొన్నారు. ఇది తీసుకున్న వారిలో మరణాల రేటు తగ్గగా, రికవరీ సమయం కూడా ఇతరులతో పోలిస్తే తగ్గిందని పేర్కొన్నారు.ప్రస్తుతం డబ్యూహెచ్‌వో తీసుకున్న నిర్ణయంతో కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్‌ మెడిసిన్‌ వాడకానికి తెరపడనుంది.

చదవండి: కోవిడ్ బాధితుల కోసం స్నాప్‌డీల్‌ సంజీవని

మరిన్ని వార్తలు