‘2019, డిసెంబర్‌కు ముందు అక్కడ కరోనా లేదు’

9 Feb, 2021 17:37 IST|Sakshi

కీలక వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్‌ఓ బృందం

బీజింగ్‌: ప్రపంచాన్ని విలవిల్లాడించిన కరోనా వైరస్‌ను డ్రాగన్‌ దేశం తయారు చేసి ప్రపంచం మీదకు వదిలిందని అమెరికాతో సహా పలు దేశాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ గురించి అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కూడా అలసత్వం ప్రదరించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం డబ్ల్యూహెచ్‌ఓ బృందం కరోనా వైరస్‌ మూలాల్ని కనిపెట్టేందుకు వుహాన్‌కు బయలు దేరింది. ఈ బృందం మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్‌ జంతువుల నుంచి వ్యాపించిందని.. కానీ అది ఏ జీవి అనేది మాత్రం తెలియడంలేదని ప్రకటించింది.

ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ ఫారిన్‌ ఎక్స్‌పర్ట్‌ బెన్‌ ఎంబరెక్‌ మాట్లాడుతూ.. ‘‘తొలి అధికారిక కరోనా కేసు నమోదయిన వుహాన్‌లో 2019, డిసెంబర్‌కు ముందు వైరస్‌ వ్యాప్తి ఉన్నట్లు మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు’’ అన్నారు. ఇక వైరస్‌ ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందనే వార్తలను ఆయన కొట్టి పారేశారు. ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 106 మిలియన్ల మంది కోవిడ్‌ బారిన పడగా.. 2 మిలియన్లకు పైగా మరణాలు సంభవించాయి. 

చదవండి: వూహాన్‌ మార్కెట్లో డబ్ల్యూహెచ్‌ఓ బృందం

>
మరిన్ని వార్తలు