WHO: మరో మహమ్మారి పొంచి ఉంది, సిద్ధంగా ఉండండి

24 May, 2023 12:01 IST|Sakshi

వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ కీలక వ్యాఖ్యలు

మరో మహమ్మరి పొంచి ఉందని  హెచ్చరికలు

కోవిడ్ కంటే డేంజర్ గా ఉంటుందని అంచనాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధిపతి టెడ్రోస్‌ అధనామ్‌ ఓ కీలక ప్రకటన చేశారు. కోవిడ్‌-19 కంటే ప్రాణాంతకమైన మరో మహమ్మారి పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కోవిడ్‌-19 ముగిసిందంటే ప్రపంచానికి ఆరోగ్య ముప్పు తొలగినట్టు కాదని టెడ్రోస్‌ చెప్పారు. 76వ ప్రపంచ ఆరోగ్య సభలో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

వాస్తవానికి ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతూ.. తొలుత ప్రాణాంతకంగా మారిన తదనంతరం తన ఉనికిని వివిధ వేరియంట్లగా మార్చుకుంటూ మనం ఎదుర్కునే తీవ్రత గల ముప్పుగా పరిణిమించడం నెమ్మదించిందన్నారు. అయినప్పటికీ ఇది మనకు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా..సాధ్యమైనంత త్వరగా ప్రతిస్పందించేలా ప్రభావవంతమైన ప్రపంచ యంత్రాగాల అవసరాన్ని గురించి నొక్కి చెప్పిందన్నారు.

సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌(ఎస్‌డీజీలు) కింద ఆరోగ్య సంబంధిత లక్ష్యాలు 2030ని మరింతగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను ఈ కోవిడ్‌ 19 మహమ్మారి తెలియజెప్పిందన్నారు టెడ్రోస్‌. ఈ మహమ్మారి 2017 ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీని ప్రకటించిన ట్రిపుల్‌ బిలయన్‌ లక్ష్యాల పురోగతిని కూడా ప్రభావితం చేసిందన్నారు. ఒకరకంగా ఈ మహమ్మారి మనల్ని ఘోరంగా దెబ్బతీసి.. సస్టెనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌(ఎస్‌డీజీ)ని నిర్వీర్యం చేసినప్పటికీ ఇలాంటి మహమ్మారీలను ఎదుర్కొనే అవశ్యకత తోపాటు భవిష్యత్తులో వీటి పట్ల ఎలా సన్నద్ధంగా ఉండాలో మనకు ఒక పాఠం నేర్పిందన్నారు డబ్ల్యూహెచ్‌ చీఫ్‌ టెడ్రోస్‌. 

(చదవండి: అలాంటివి మేము అంగీకరించం.. చర్యలు తీసుకుంటాం! భారత్‌కి హామీ)

మరిన్ని వార్తలు