నా మొగుడు ఏం చేసినా పర్లేదు.. వార్నీ! ఇలాంటి భార్యలు కూడా ఉంటారా? దేవుడా!

30 Mar, 2023 16:09 IST|Sakshi

వాషింగ్టన్‌: భార్యాభర్తల బంధం అన్నింటికంటే దృఢమైంది అంటారు. పెళ్లయ్యాక పతియే తన సర్వస్వంగా భావిస్తుంటారు మహిళలు. ఒకరిపైఒకరు ప్రేమానురాగాలు చూపుతూ ఆనందంగా జీవిస్తారు. వైవాహిక బంధంలో నిజాయితీ, విధేయతతో ఉండాలనుకుంటారు. అలాంటిది తన భర్త మరో మహిళలో సన్నిహితంగా మెలిగితే? మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుంటే? ఏ భార్య అయినా భరిస్తుందా? ఆమె కోపం ఎలా ఉంటుందో కూడా ఉహించుకోలేం..

కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. తన భర్తను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉండమని ఆమే ప్రోత్సహిస్తోంది. వాళ్లతో శారీరకంగా కలిసినా పర్వాలేదు అంటోంది. ఆయన ఎవరితో వెళ్లినా, ఏం చేసినా సరే.. సంతోషంగా ఉంటే చాలట. ఆయన హ్యాపీగా ఉంటే తనకు అదే చాలు అని ఆనందంగా చెబుతోంది. ఇది భార్యగా తన బాధ్యత అంటోంది. ఈ మాటలు విన్నాక ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి. ఈరోజుల్లో ఇలాంటి భార్యలు కూడా ఉంటారా? అని అనుకుంటారు కదా..

భర్తకు ఇంత ఫ్రీడం ఇచ్చి ఈమె పేరు మోనికా హల్ట్‌. వయసు 37 ఏళ్లు. భర్త పేరు జాన్‌.  పెళ్లయ్యాక ఇంటికే పరిమితమైంది. రోజంతా ఇంటిపనులే చేస్తూ తీరకలేకుండా ఉంటోంది. జాన్‌కు ఇష్టమైన వంటలు చేసిపెట్టడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం, ఇతర పనులు చేసుకోవడమే ఈమె దినచర్య.

అందుకే జాన్‌తో బయటకు వెళ్లే సమయం కూడా ఉండదు. ఈ కారణంగానే భర్తను ఇష్టమైన వారితో గడపమని ఆమే స్వయంగా చెబుతోంది.  జాన్‌కు ఏదీ సంతోషం అయితే అది నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ప్రోత్సహిస్తోంది. అతను ఇతర మహిళలతో శృంగారంలో పాల్గొన్నా తాను అసలు బాధపడనని అంటోంది.

అలాగే తాను రోజు ఏ దుస్తులు ధరించాలో కూడా భర్తే డిసైడ్ చేస్తాడని, ఆయన చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తాని మోనికా పేర్కొంది. సెక్సీ, స్పోర్టీ డ్రస్సులంటే తన భర్తకు ఇష్టమని తాను ఇంట్లో అవే ధరిస్తానని వివరించింది. తాను మేకప్ వేసుకుంటే జాన్‌కు అస్సలు నచ్చదని, అందుకే నేచురల్‌గానే ఉంటానంటోంది.  భర్తలు వేరే వాళ్లతో మాట్లాడితేనే ఊరుకోని మహిళలు ఉన్న ఈరోజుల్లో ఇలాంటి భార్య దొరకడం నిజంగా జాన్ అదృష్టం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..!

మరిన్ని వార్తలు