దేవుడిలా రక్షించిన వాచ్‌...భర్త చేతిలో సజీవ సమాధి కాకుండా...

23 Oct, 2022 15:32 IST|Sakshi

ఒక ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌ ఒక మహిళను భర్త చేతిలో హతం కాకుండా కాపాడింది. సరికొత్త ఫ్యూచర్లతో మంచి ఎలక్ట్రానిక్‌ గాడ్జ్‌ట్‌లు ఆకర్షణీయంగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. ప్రజలు కూడా అంతే క్రేజ్‌గా కొంటున్నారు. ఈ కొంగొత్త టెక్నాలజీలు మనుషులను కొన్ని విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే అచ్చం అలానే ఇక్కడొక మహిళను ఒక యాపిల్‌ వాచ్‌ విపత్కర సమయంలో దేవుడిలా రక్షించింది.

వివరాల్లోకెళ్తే..వాషింగ్టన్‌కి చెందిన యంగ్‌ సూక్‌ ఆన్‌ అనే 42 ఏళ్ల మహిళ తన భర్త చాయ్ క్యోంగ్‌తో గత కొంతకాలంగా గొడవపడుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోవాలని నిశ్చయించుకున్నారు. ఐతే విడిపోతే ఆమెకు భరణంగా తన రిటైర్మెంట్‌ డబ్బు ఇవ్వాల్సి వస్తుందని ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా చాంగ్‌ క్యోంగ్‌ ఆమె ఇంటికి వచ్చి గొడవపడటేమే గాక తన కుట్రలో భాగంగా ఆమెను తీవ్రంగా హింసించాడు. తదనంతరం ఆమెను టేప్‌తో చుట్టి గ్యారెజ్‌ వద్దకు ఈడ్చుకుని వెళ్లాడు.

ఆ తర్వాత ఆమెను కార్‌వ్యాన్‌లో ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవ సమాధి చేశాడు. ఆమె ఎంత ప్రాధేయపడుతున్న వినలేదు. దీంతో ఆమె తన చేతికి ఉన్న యాపిల్‌ వాచ్‌ సాయంతో అత్యవసర నెంబర్‌ 911కి కాల్‌ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి....వాషింగ్టన్‌లోని సీటెల్‌కు 60 మైళ్ల దూరంలో ఆమెను గుర్తించి రక్షించారు. ఐతే ఆమె అప్పటికే తీవ్ర అశ్వస్థకు గురై కొన ప్రాణాలతో కొట్టుకుంటోంది.

ఆమె ఆ సమయంలో తన 20 ఏళ్లు కూతురుకి కూడా తాను ప్రమాదంలో ఉన్నట్లు వాచ్‌ ద్వారా తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అందరూ సమయానికి అప్రమత్తమవ్వడంతోనే ఆమెను సురక్షితంగా రక్షించగలిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రక్షించే సమయంలో ఆమె మొత్తం టేప్‌తో సీల్‌ చేసి తీవ్ర గాయలపాలై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంతక మునుపు కూడా ఈ యాపిల్‌ వాచ్‌​ ఎంతమందినో పలురకాలుగా వారి ప్రాణాలను కాపాడింది.

(చదవండి: వైద్యుడే వాచ్‌ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్‌ వాచ్‌!)

మరిన్ని వార్తలు