భర్త ప్రవర్తనతో విసుగుచెంది.. సోషల్‌ మీడియాలో పెట్టేసింది!

15 Oct, 2021 10:25 IST|Sakshi

‘గతంలో మా వాళ్లు అలా ఉండేవారు.. పూర్వం ఇంటిపనులన్నీ భార్యలే చూసుకునేవారు’ అనుకుంటే అది నేటి సమాజంలో కుదరదు. ప్రస్తుత జీవన విధానంలో భార్యా-భర్తలు తమ తమ విధులతో బిజీగా ఉండటమే కాదు.. భార్యదే శ్రమాధిక జీవనమని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. అటువంటి తరుణంలో చిన్న చిన్న పనులు కూడా భర్త చేసుకోలేకపోతే అది కాపురంలో చిచ్చుపెట్టడమే కాకుండా, సోషల్‌ మీడియా వరకూ వెళుతుంది కూడా. ఒక జంట విషయంలో ఇదే పరిస్థితి తలెత్తింది. ఒక భర్త ఇలా చేసేనందుకే అతని బండారాన్ని సోషల్‌ మీడియా వేదికగా బయటపెట్టేసింది భార్య. 

భార్యాభర్తలు బాధ్యతగా ఉండటమంటే ఒకరి పనుల్లో మరొకరు సహకరించుకోవడమే. ప్రధానంగా ఇంటిపనుల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఒక పని భార్య చేస్తే, మరొక పని భర్త చేయాలి. అలా కాకపోతే ఇద్దరి మధ్యలోకి గొడవలు రావడం అతి సాధారణం. కనీసం తను తినడానికి వాడిన వస్తువుల్ని కూడా భర్త శుభ్రం చేయకుండా భార్యే చూసుకుంటుందులే అనుకుంటే అది పొరపాటే. ఇండోనేసియాలో భర్త విషయంలో ఇది రుజువైంది కూడా.

ప్లేట్‌లు  కడగలేదని సోషల్‌ మీడియాలో..
ఇండోనేషియాకు చెందిన ఆ జంట  కాపురం సోషల్‌ మీడియాకు ఎక్కడానికి భర్త తిని కడగకుండా వదిలేసిన ప్లేట్‌,  కప్‌ కారణం. ఏ రోజు కూడా తినడం, వెళ్లిపోవడమే చేస్తున్నాడు భర్త. కనీసం వాటిని సింక్‌లో వేయాలి.. వాటిని శుభ్రం చేయాలనే సోయి కూడా లేకుండా పోయింది. దాంతో విసిగిపోయిన భార్య.. ఒకరోజు తిరుగుబాటుకు దిగింది. భర్త తిని పక్కనే పడేసిన వస్తువుల్ని విసిరి కొట్టడమే కాకుండా ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో పెట్టేసింది. పనిలో పనిగా ఇలా చేసే పురుషుల్నికూడా నిలదీసింది. 

మీ భార్యను అర్థం చేసుకోండి.. 
‘మీ భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.  వారు ఉపయోగించిన వంట వస్తువుల్నిఎందుకు పురుషులు కడగరు. పురుషులారా.. మీరు తినడం పూర్తి చేసిన అనంతరం వాటికి వాడిన వస్తువుల్ని వదిలేయడం ఎందుకు. మీరు ఉపయోగించిన ప్లేట్‌ కానీ ఏ వస్తువునైనా కడగడంలో తప్పు ఏముంది‘ అని ప్రశ్నించింది. ఇది ఆన్‌లైన్‌ చర్చకు దారి తీసింది. ఆ వస్తువుల్ని భర్త వాష్‌ చేసే ఉద్దేశం లేకపోతే కనీసం సింక్‌లో ఉంచాలని కొందరు సూచించగా, దీనికి అరటి ఆకుల్ని వాడటం మరొక ఉత్తమ మార్గమని కొంతమంది సలహాలు ఇచ్చిపడేస్తున్నారు.

మరిన్ని వార్తలు