77 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసి హతమార్చిన కంగారు

13 Sep, 2022 11:07 IST|Sakshi

సిడ్నీ: ఒక అడవి కంగారు 77 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసి హతమార్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఒక అడవి కంగారును ఆ వృద్ధుడు పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేటప్పటికీ కంగారు దాడిలో త్రీవంగా గాయపడి ఆ వృద్ధుడు మృతి చెంది ఉన్నాడని తెలిపారు.

ఐతే అంబులెన్స్‌ సిబ్బంది ఆ వృద్ధుడిని తరలించే సమయంలో అడవి కంగారు అక్కడే ఉండి ప్రమదకరంగా ఉండటంతో తప్పనసరి పరిస్థితుల్లో కాల్చి చంపినట్లు వెల్లడించారు. 1936 తర్వాత కంగారు చేసిన ప్రాణాంతక దాడి ఇదేనని పోలీసులు చెబుతున్నారు. గతంలో క్రూక్‌షాంక్‌ అనే వ్యక్తి కూడా కంగారు దాడి నుంచి రెండు కుక్కలను రక్షించే క్రమంలో ఇలానే దాడికి గురై మృతి చెందాడని చెప్పారు.

(చదవండి: చందమామే దిగి వచ్చిందా!)

మరిన్ని వార్తలు