మబ్బుల మధ్య చేపలు.. ఎన్నున్నాయో చూశారా..!

3 Sep, 2022 20:05 IST|Sakshi
ఫొటో కర్టెసీ: గార్డియన్‌

నీటిలో ఉండాల్సిన చేపలు నింగిలో మబ్బుల మధ్య ఎగురుతున్నట్లు.. ఏదో స్వర్గంలో ఉన్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఫిన్లాండ్‌కు చెందిన టీనా టోర్మెనెన్‌ హోంకాలెంపీ సరస్సులో తీశారు. ‘అండర్‌వాటర్‌ వండర్‌­ల్యాండ్‌’లా టోర్మెనెన్‌ అభివర్ణిస్తున్న ఈ ఫొటో ప్రతిష్టాత్మక ‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పోటీలో ఎన్నదగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వివిధ విభాగాల్లో విజేతలను అక్టోబర్‌ 11న ప్రకటిస్తారు. ఆ మేఘాల్లా కనిపిస్తున్నవి ఒకరకమైన నాచు అట. 


ముందు ఫొటోలోని చేపలు స్వర్గంలో విహరిస్తున్నట్లు కనిపిస్తుంటే.. ఇవేమో.. వందలాదిగా నిర్జీవంగా శ్మశానంలో ఉన్నట్లుగా పడి ఉన్నాయి.. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన మన్నెపురి శ్రీకాంత్‌ తీశారు. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌లో ఎన్నదగిన ఫొటోల్లో ఇది కూడా ఉంది. అసలు ఎన్నున్నాయో చూశారా.. ఒకేచోట ఇన్ని పెద్ద చేపలు.. వీటిని చూసి ఆశ్చర్యపోయే.. కాకినాడ ఫిష్‌ మార్కెట్‌ భారీతనాన్ని చూపించడానికి ఆయన డ్రోన్‌ ద్వారా ‘వన్‌డే క్యాచ్‌’ పేరుతో ఈ చిత్రాన్ని క్లిక్‌మనిపించారు. (క్లిక్‌: మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్‌.. ఎక్కడంటే!)

మరిన్ని వార్తలు