Shortest Day In 2021: ఈ ఏడాదిలో ఈరోజు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా?

21 Dec, 2021 19:48 IST|Sakshi

ఈ ఏడాదిలోనే ఈరోజుకి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే, డిసెంబర్ 21ని అత్యంత చిన్నరోజుగా నాసా అధికారులు గుర్తించారు. నేడు సూర్యుడి నుంచి ఉత్తరార్ధగోళం తన కక్ష్యలో దూరంగా వంగి ఉన్నందున ఈ సంవత్సరంలో ఇదే తక్కువ పగలు రోజుగా నిలుస్తుందని వారు తెలిపారు. సూర్యుని నుంచి దూరంగా వంగి ఉండటం వల్ల ఉత్తరార్ధగోళం మీద తక్కువ సూర్యకాంతి పడుతుంది. దీంతో ఈ రోజు చాలా తొందరగా గడిచినట్లు ఉత్తరార్ధగోళంలో నివసించే వారికి అనిపిస్తుంది.

ఈరోజు పగటి పుట సమయం చాలా తక్కువగా ఉండటం, రాత్రి ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఇలా సంవత్సరంలో రెండుసార్లు సంభవిస్తుంది. ఉత్తరార్ధగోళంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 22 మధ్య కాలంలో, దక్షిణార్థ గోళంలో జూన్ 20 నుంచి 21 మధ్య కాలంలో ఇలా సంభవిస్తుంది. పురాతన కాలంలో ఈ రోజున రోమన్లు శనిదేవుడిని తిరిగివచ్చినట్లుగా భావించేవారు. మన దేశంలో అత్యల్ప తక్కువ రోజుగా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఇదే పండుగను చైనీయులు, జపనీయులు కూడా జరుపుకుంటారు.

(చదవండి: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఆదాయం ఎంతనో తెలుసా..!)

మరిన్ని వార్తలు