Winter Storm Izzy: అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ.. 1,200 విమానాలు రద్దు

18 Jan, 2022 12:00 IST|Sakshi
వర్జీనియా రాష్ట్రంలోని రోనక్‌ సిటీలో మంచుమయమైన రహదారి.

అట్లాంటా: అమెరికా ఆగ్నేయ ప్రాంతాన్ని చలి తుఫాను, పెనుగాలులు, హిమపాతం వణికిస్తున్నాయి. వీటి ప్రభావంతో చాలాచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయాలు, వృక్షాలు నేలకూలడం, రోడ్లన్నీ మంచుతో నిండిపోవడం జరుగుతోంది. జార్జియా, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా తదితర ప్రాంతాలన్నీ ఆదివారం నుంచి చలిపులి చేతికి చిక్కి వణుకుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు హైవే పెట్రోల్‌ అధికారులు తెలిపారు.
(చదవండి: లైన్‌లో నిలబడితే డబ్బులే డబ్బులు.. గంటకు రూ.2 వేలు పక్కా!)


కారును మంచు కప్పేసిన దృశ్యం

ఫ్లోరిడాలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో విరుచుకుపడ్డ టోర్నడో బీభత్సంతో ఒక ట్రైలర్‌ పార్క్‌ నాశనమైంది. చార్లట్‌ డగ్లస్‌ విమానాశ్రయం నుంచి 1,200కు పైగా విమానాలను రద్దు చేశారు. కరోలినాలో దాదాపు 1.5 లక్షల మంది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్‌ పై ప్రభావం ఉండకపోయినా, లాంగ్‌ ఐలాండ్, కనెక్టికట్‌ తీరప్రాంతాల్లో ప్రభావం ఉంటుందని అంచనా. ఒహాయో, పెన్సిల్వేనియాల్లో 6– 13 అంగుళాల మేర హిమపాతం ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. 
(చదవండి: అఫ్గనిస్తాన్‌లో భారీ భూకంపం.. 26 మంది మృతి)

మరిన్ని వార్తలు