విమానంలో కరోనాతో మరణించిన మహిళ

22 Oct, 2020 11:58 IST|Sakshi

వాషింగ్టన్‌: ఈ ఏడాది జూలై చివరలో లాస్ వెగాస్ నుంచి డల్లాస్ వెళ్లే స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు టెక్సాస్‌కు చెందిన మహిళ మరణించిన సంగతి తెలిసిందే.అయితే ఆమె కోవిడ్ -19 తో మరణించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. స్పిరిట్ ఫ్లైట్ జూలై 24 సాయంత్రం లాస్ వెగాస్ నుంచి డల్లాస్-ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న మహిళ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె ఎంత సేపటికి స్పందించకపోవడంతో ఆ విమానాన్ని అల్బుకెర్కీ వద్ద ఆపేశారు. అయితే ఫ్లైట్‌ అక్కడికి వచ్చే సరికే సదరు మహిళ చనిపోయిందని ఆల్బుకెర్కీ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్ ప్రతినిధి స్టెఫానీ కిట్స్ చెప్పారు.

అయితే ఆ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు  టెక్సాస్‌కు చెందిన 38 ఏళ్ల  మహిళ విమానంలో అపస్మారక స్థితిలోకి వెళ్లి శ్వాస ఆగిపోయిందని తెలిపారు. విమానంలో ఒక సభ్యుడు ఆమెకు సీపీఆర్‌ చేయడానికి ప్రయత్నించడని కానీ ఫలితం లేకపోయింది అని తెలిపారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే తాజాగా ఆమె రిపోర్ట్‌లు వచ్చే వరకు సదరు మహిళ కరోనాతో మరణించినట్లు విమాన సిబ్బందికి తెలియదు. ఈ ఘటన విమానాల్లో ప్రయాణించే వారి భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. 

ఈ విషయం గురించి స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి ఎరిక్ హాఫ్మేయర్ మాట్లాడుతూ మహిళ కుటుంబానికి, స్నేహితులకు ఎయిర్‌లైన్స్‌ తరుపున సంతాపం తెలిపారు. కరోనావైరస్‌కు సంబంధించి ఎయిర్‌లైన్స్‌ తన ప్రోటోకాల్స్ ఫాలో అవుతుదని, తప్పకుండా ఏ తప్పు జరగదనే నమ్మకం తమకు ఉందని పేర్కొ‍న్నారు.  అయితే ఆ మహిళతో కాంటాక్ట్‌ అయిన అభ్యర్థులను ట్రేస్‌ చేస్తున్నట్లు తెలిపారు.  

చదవండి: ‘అతను చనిపోయింది మా వ్యాక్సిన్‌ వల్ల కాదు’

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా