16 సార్లు అరెస్ట్‌ చేసిన వ్యక్తికే ప్రాణదానం

12 Sep, 2020 13:06 IST|Sakshi

అలబామా : మేలు చేసిన వారికి సాయం చేయడం కృతజ్ఞత భావం.. 16 సార్లు కటకటాల్లోకి నెట్టిన వ్యక్తికి కిడ్నీ దానం చేసి జోసెలిన్ జేమ్స్ మానవత్వాన్ని చాటుకుంది. ఈ ఘటన అలబామాలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. అలబామాకు చెందిన  జోసెలిన్ జేమ్స్ .. కొన్ని సంవత్సరాల క్రితం మత్తు పదార్థాలకు బానిసగా మారింది. ఎంతలా అంటే జీవితంలో అన్ని బంధాలను వదులుకొని డ్రగ్స్‌నే తన ఆహారంగా చేసుకొని బతికేసింది.

ఈ నేపథ్యంలోనే తను చేసే జాబ్‌, ఇష్టపడి కొనుక్కున్న కారు, ఇళ్లు కూడా అమ్మేసుకుంది. బతకడానికి దొంగతనాలు కూడా చేసింది. అనతికాలంలోనే జేమ్స్‌ అలబామాలో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా పేరు పొందింది. 2007 నుంచి 2012 వరకు దాదాపు 16 సార్లు టెర్రెల్ పాటర్ అనే పోలీస్‌కు చిక్కి అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లి వచ్చింది. టెర్రెల్‌ పాటర్‌ కూడా ఈ జీవితాన్ని వదిలేసి మంచి మనిషిగా మారు అని ఎన్నోసార్లు చెప్పిచూశాడు. టెర్రెల్‌ పాటర్‌ అనే వ్యక్తి మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడని బహుశా అప్పుడు ఊహించి ఉండదు. (చదవండి :మొత్తం పోయింది: కాలిఫోర్నియా బాధితుల ఆవేదన)

ఇదలాఉండగా.. జేమ్స్‌  ఒకరోజు ఇంట్లోనే టీవీ చూస్తుండగా.. మోస్ట్‌ వాంటెడ్‌ అనే వార్త ఆమెను షాక్‌కు గురయింది. ఎందుకంటే మోస్ట్‌ వాంటెడ్‌ అని చూపిస్తుంది ఎవరిదో కాదు.. జోసెలిన్ జేమ్స్ దే. అప్పుడు తనకు అర్థమయింది.. తాను ఏ స్టేజీలో ఉన్నానో.. ఇక ఈ జీవితం వద్దని చెప్పి నేరుగ అధికారుల వద్ద లొంగిపోయింది. ఆరు నెలల జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన జేమ్స్‌ నేరుగా డ్రగ్‌ అడిక్షన్‌ సెంటర్‌కు వెళ్లి తొమ్మిది నెలలు అక్కడే రీహాబిటేట్‌గా మార్చుకుంది. అక్కడి నుంచి జేమ్స్‌ జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం జేమ్స్‌ తనలాగే డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న మహిళను ఆ మహమ్మారి నుంచి రక్షించే పనిని చేస్తుంది.  

ఒకరోజు జేమ్స్‌ తన ఫేస్‌బుక్‌ ఓపెన్ చేయగా.. టెర్రెల్‌ పాటర్‌ కిడ్నీ దెబ్బతిన్నాయని.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం దాత అవసరం ఉందని టెర్రెల్‌ కూతురు షేర్‌ చేసిన పోస్ట్‌ కనిపించింది. వెంటనే టెర్రెల్‌ కూతురును కలిసి కిడ్నీని దానమిచ్చేందుకు తాను సిద్దమని తెలిపింది. గత జూలైలో వాండెర్‌బిల్ట్‌ యునివర్సీటీ మెడికల్‌ హెల్త్‌ సెంటర్‌లో టెర్రెల్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విజయవంతంగా జరిగింది. ఇప్పుడు జేమ్స్‌, టెర్రెల్‌ ఆరోగ్యంతోనే ఉన్నారు.(చదవండి : విషాద జ్ఞాపకానికి 19 ఏళ్లు..)

ఇదే విషయమై టెర్రెల్‌ స్పందిస్తూ.. ' నా అనుకున్నవారు సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అలాంటిది పోలీస్‌ ఆఫీసర్‌గా 16 సార్లు జైలుకు పంపించిన అమ్మాయి వచ్చి నాకు కిడ్నీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం ఎందుకంటే.. నాకు కిడ్నీ దానం చేస్తమని ఒక వంద మంది ముందుకు వస్తే అందులో జేమ్స్‌ పేరు కచ్చితంగా ఉండదనే అనుకుంటాం. ఎందుకంటే ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించిన తర్వాత మళ్లీ నాకు కనిపించలేదు.. సరైన కాంటాక్ట్‌ కూడా లేదు.. కానీ దేవుడు మా ఇద్దరిని ఈ విధంగా కలుపుతాడని మాత్రం నేను ఊహించలేదు అంటూ టెర్రెల్‌ ఉద్వేగంతో పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు