నమ్మించి మోసం చేశాడు; పెళ్లి పెటాకులు చేసుకున్నా

4 Jul, 2021 15:56 IST|Sakshi

''నేను ఎంతో ప్రేమించిన నా బాయ్‌ఫ్రెండ్‌ ఇంతలా మోసం చేస్తాడని ఊహించలేదు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్‌ లిస్ట్‌ను గమనిస్తే కానీ నాకు ఆ విషయం తెలియలేదు. నా ఇన్‌స్టాలో ఉన్న ఒక అమ్మాయిని నాకు తెలియకుండానే బ్లాక్‌ చేశాడు. ఆ అమ్మాయితో లవ్‌ ఎఫైర్‌ నడిపాడు. తను నా ఫ్రెండ్‌ అని తెలిస్తే మొదటికే మోసం వస్తుందని ఇలా చేశాడు. ఒకసారి మోసం చేస్తే ప్రేమించాడని వదిలేసి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నా.. కానీ రెండోసారి అదే తప్పుచేశాడు. అందుకే వాడితో పెళ్లి పెటాకులు చేసుకున్నా'' అంటూ న్యూయార్క్‌కు చెందిన గాబీ మార్సెల్లస్(25) చెప్పుకొచ్చింది.

గాబీ మర్సెల్లస్‌ టిక్‌టాక్‌ వీడియోతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. యూకేకు చెందిన ఒక యువకునితో ప్రేమాయణం కొనసాగించింది. 2019 సమయంలో న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా గాబీ బాయ్‌ఫ్రెండ్‌ అమెరికాకు వచ్చాడు. ఆరోజు రాత్రి తాగుతూ ఫుల్‌ ఎంజాయ్‌ చేసిన వారిద్దరికి ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తర్వాత గాబీ మద్యం మత్తులో నిద్రలోకి జారుకోగా.. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మాత్రం ఆమె ఫోన్‌ ద్వారా క్యాబ్‌ను బుక్‌ చేసుకొని అక్కడినుంచి వెళ్లిపోయాడు. తర్వాతి రోజు నిద్రలేచిన గాబీ తన ఫోన్‌ చూసుకోగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అమ్మాయిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడం గమనించింది. తాను ఈ పని చేయలేదు.. మరి ఎవరు చేసుంటారు అని ఆలోచించింది.

ఇది కచ్చితంగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ పనేనని, తనకు తెలియకుండా ఈ అమ్మాయితో ఎఫైర్‌ నడిపిస్తున్నాడా అనే అనుమానం కలిగి వెంటనే బాయ్‌ఫ్రెండ్‌ను అడగ్గా.. ఆరోజు తాగిన మత్తులో తెలియక బ్లాక్‌ చేసి ఉంటానని కవర్‌ చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత లండన్‌కు వచ్చిన గాబీ తన బాయ్‌ఫ్రెండ్‌ వేరే అమ్మాయితో సీక్రెట్‌ ట్రిప్‌కు వెళుతున్నట్లు తెలుసుకుంది. ఇదే విషయమై అతన్ని నిలదీయగా.. అలాంటిదేం లేదని.. ఆమెను తన ఇంటిదగ్గర దిగబెట్టడానికి వెళుతున్నానని చెప్పాడు. కానీ గాబీ అతని మాటలు నమ్మకుండా నువ్వు నన్ను చీటింగ్‌ చేస్తున్నావు.. మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని నిలదీసింది.

దానికి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఒప్పుకోవడంతో అదేరోజు ఇద్దరికి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు వారి జీవితం సాఫీగానే సాగింది. ఉద్యోగం పేరుతో గాబీ బాయ్‌ఫ్రెండ్‌ లండన్‌కు వచ్చాడు. ఆ తర్వాత అక్టోబర్‌ 2020లో గాబీ కూడా లండన్‌ షిఫ్ట్‌ అయింది. అప్పుడే గాబీకి షాకింగ్‌ విషయం తెలిసింది. తన బాయ్‌ఫ్రెండ్‌ ఇంకా ఆ అమ్మాయితో రిలేషన్‌షిప్‌ మెయింటేన్‌ చేస్తున్నాడని, ఇంతకాలం తనను మోసం చేశాడని గ్రహించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడింది. ఆ తర్వాత ఇద్దరికి జరిగిన ఎంగేజ్‌మెంట్‌ చెల్లదని... అతను పెట్టిన రింగ్‌ను మొహం మీద కొట్టేసి గాబీ అక్కడినుంచి వచ్చేసి ప్రస్తుతం న్యూయార్క్‌లో తన లైఫ్‌ చూసుకుంటుంది.

మరిన్ని వార్తలు