రాక్షసి: గర్భిణిని చంపి, బిడ్డను తీసుకొని...

16 Oct, 2020 09:42 IST|Sakshi

టెక్సాస్‌: అమెరికాలో దారుణం జరిగింది. ఒక నిండు గర్భిణిని చంపి ఆమె కడుపులో నుంచి బిడ్డను తీసుకుంది ఒక మహిళ. టేలర్‌ పార్కర్‌(27) అనే మహిళ గత బుధవారం వరకు టెక్సాస్‌ జైలులో ఉంది. అయితే గత గురువారం నాడు 5 మిలయన్‌ డాలర్ల పూచికత్తుతో ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిందే తడవుగా ఆమె మరో ఘాతుకానికి పాల్పడింది. ఒక గర్భిణిని చంపి ఆమె బిడ్డను తనకు పుట్టిన శిశువుగా తీసుకొని ఆసుపత్రికి తీసుకొని వచ్చింది.

తనకు రోడ్డు పక్కన కానుపు అయ్యిందని ఆసుపత్రిలో వారికి కట్టుకథలు చెప్పింది. శిశువు శ్వాస తీసుకోవడం లేదని చికిత్స చేయాలని కోరింది. బిడ్డను పరిశీలించిన  డాక్టర్లు ఆమె మరణించినట్లు ప్రకటించారు. అనంతరం అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పార్కర్‌ను నిలదీయగా అసలు విషయం బయట పెట్టింది. చనిపోయిన మహిళ మృతదేహాన్ని పార్కర్‌ ఉన్న ప్రాంతానికి 15 కిలో మీటర్ల దూరంలో గుర్తించారు.  హత్య, అపహరణ ఆరోపణలపై పార్కర్‌ను పోలీసలు మరోసారి అరెస్ట్‌ చేశారు. 
చదవండి: ట్రంప్‌ క్యాంపెయిన్ ఖాతాను బ్లాక్‌ చేసిన ట్విటర్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు