విమానంలో సిగరెట్‌ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్‌

27 Aug, 2021 12:43 IST|Sakshi

సాక్షి, తల్లహస్సీ: బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడాన్ని నిషేధిస్తూ ఇ‍ప్పటికే అనేక దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకొవడంతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అయితే, కొంత మంది వ్యక్తులు అప్పుడప్పుడు బస్సుల్లో లేదా రైళ్లల్లో సిగరెట్‌ తాగిన సంఘటనలు తరచుగా వార్తలలో వస్తుంటాయి. సిగరెట్‌ తాగటం వలన..  వారికే కాకుండా తోటి  ప్రయాణికుల ప్రాణాలకు కూడా పెద్ద ముప్పు సంభవించే అవకాశం ఉంటుంది. కాగా, ఒక యువతి ఏకంగా విమానంలోనే సిగరెట్‌ తాగి తోటి ప్రయాణికులను షాకింగ్‌కు గురిచేసింది. ఈ సంఘటన ఫ్లోరిడాలోని స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో గత మంగళవారం చోటుచేసుకుంది.

ఒక తోటి ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేయగా ఇది వైరల్‌గా మారింది.  ఫోర్ట్‌లాడర్‌డేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన  విమానం టేక్‌ఆఫ్‌ అయ్యింది. రన్‌వే మీద వెళ్లడానికి మరికొంత సమయం ఉంది. ఈ క్రమంలో ఒక యువతి సిగరెట్‌ను తీసి తాగడం ప్రారంభించింది. దీంతో తోటి ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. అయితే, ఆమెతో పాటు ప్రయాణిస్తున్న.. మజ్దలావి అనే వ్యక్తి దీన్ని రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా విమాన సెక్యురిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే యువతి దగ్గరకు చేరుకుని ఆమెను కిందికి దిగిపోవాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. కాగా, యూఎస్‌లో 1988లోనే బహిరంగ ప్రదేశాలలో సిగరెట్‌ తాగడాన్ని నిషేదించారు. 

చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్‌ వీడియో..

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు