పెళ్ళిలో అపశ్రుతి.. భర్తకు బదులు మామను పెళ్లి చేసుకుంది

20 Jul, 2023 12:14 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన పాపులర్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీలో ఒక మహిళ తన వివాహంలో జరిగిన పెద్ద పొరపాటు గురించి చెప్పుకొచ్చింది. పెళ్ళిలో తన భర్త సంతకం చెయ్యాల్సిన చోట మామగారు సంతకం పెట్టడంతో మామగారితోనే వివాహమైనట్టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వారు సర్టిఫికెట్ ఇచ్చారని, ప్రస్తుతం తనకు ఇద్దరు భర్తలని చెప్పుకొచ్చింది. 

ఆస్ట్రేలియా ప్రఖ్యాత బ్రేక్ ఫాస్ట్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీ కార్యక్రమంలో ఆరోజు ఫోన్ చేసిన వారందరినీ తమ జీవితంలో జరిగిన పేద పొరపాట్లగురించి చెప్పమని అడిగారు వ్యాఖ్యాత. దీంతో కిమ్ అనే ఒక మహిళ తాన్ పెళ్ళిలో జరిగిన విచిత్రమైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. నా పెళ్ళికి సాక్షులుగా సంతకం చేయడానికి మా మామగారు అత్తగారు తప్ప ఇంకెవ్వరూ లేరు. 

సరిగ్గా పెళ్లి సమయానికి మా అత్తగారు మామగారితో పాటు సాక్షి సంతకం చెయ్యమని నా భర్తను కోరారు. దీంతో వారిద్దరూ ఒకే లైన్ సంతకం చేశారు. తీరా సర్టిఫికెట్లో చూస్తే వధువు అని ఉన్న చోట నా సంతకం ఉంటే వరుడు అని ఉన్నచోట మాత్రం నా భర్తతో పాటు మా మామగారి పేరు కూడా ఉంది. ఆ సర్టిఫికెట్ ను  ఇంకా మార్చకుండా అలాగే భద్రం చేసుకున్నానని తెలిపింది. 

ఇది కూడా చదవండి: కిమ్ జోంగ్ చెరలో అమెరికా సైనికుడు.. బయటపడేనా..?

మరిన్ని వార్తలు