ఆస్తి అక్కర్లేదు.. ప్రియుడి కోసం వేల కోట్లు వదులుకున్న గొప్ప ప్రేమికురాలు!

14 Aug, 2023 12:39 IST|Sakshi

ప్రేమ.. దీన్ని వర్ణించాలంటే కవులకు సైతం కలంలో సిరా సరిపోదు. ఇది చెప్పడం కంటే అనుభూతి చెంది తెలుసుకోవాల్సిందే. అయితే ఇటీవల యువతీయువకులు కొందరు ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇదే ట్రెండ్‌గా పాటిస్తున్నారు చాలామంది. అయితే ఓ యువతి మాత్రం మనీ కంటే తన మనసుకు నచ్చిన వాడే కావాలనుకుంది. కోట్ల ఆస్తి కంటే బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ఉండడమే బెటర్‌ అనుకుంది.

ఆస్తి కాదు.. అతనే ముఖ్యం
వవరాల్లోకి వెళితే.. మలేషియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఖుకే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ ఛై దంపతుల కుమార్తె ఏంజెలిన్. ఆమె పైచదువుల కోసం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరింది. ఆ సమయంలో ఏంజెలిన్‌ జెడిడియా ఫ్రాన్సిస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది.కొన్నాళ్ల తర్వాత వారిద్దరూ వివాహ బంధంతో ఒకటిగా మారాలనుకున్నారు.


ఇక్కడ వరకు సాఫీగా సాగిన వాళ్ల లవ్‌స్టోరీ ఇక్కడే బ్రేక్‌ పడింది. తన ప్రేమ విషయాన్ని ఏంజెలిన్ తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే జెడిడియా ధనవంతుడు కాదన్న కారణంగా ఆమె తండ్రి వాళ్ల పెళ్లికి అంగీకరించలేదు. అంతేకాకుండా తనను కాదని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదని తేల్చి చెప్పారు. దాంతో ఏంజెలిన్.. నాకు మీ ఆస్తిలో పైసా కూడా అవసరం లేదు, నేను ప్రేమించిన వాడితోనే నా జీవితం అంటూ ఏంజెలిన్ సుమారు రూ.2,484 కోట్ల ఆస్తిని వదులుకుంది.

ప్రియుడే కావాలని అతడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులను వదిలి ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి తన కుటుంబానికి దూరంగా జీవిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఏంజెలిన్‎పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి   ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్‌.. ఆనక వధువు ఏంచేస్తుందంటే..

మరిన్ని వార్తలు