Viral: వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ అడిగినందుకు నానా హంగామా.. నేనెవరో తెలుసా? అంటూ

13 Oct, 2021 16:28 IST|Sakshi

కరోనా వైరస్‌ వాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ చూపించడం కొన్నిచోట్ల తప్పనిసరి అయిపోయింది. అయితే కొంతమంది ఆ సర్టిఫికేట్‌ చూపి తమ పనులను చేసుకుంటున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్‌లో కరోనా వాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ చూపమన్నందుకు ఓ మహిళా కస్టమర్‌ రెస్టారెంట్‌ సిబ్బందిపై అరుస్తూ.. కోపంతో ఊగిపోయారు. ఈ ఘటన కరాచీలోని ఓక్రా టెస్ట్ కిచెన్ రెస్టారెంట్‌లో చోటు చేసుకుంది.

ఓ మహిళ కస్టమర్‌ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బంది బాధ్యతగా కరోనా వైరస్‌ టీకా ధ్రువపత్రాన్ని చూపాలని ఆమెను కోరారు. దీంతో ఆమె ఒక్కసారిగా కోపంతో ఊగుపోతూ.. తనను సర్టిఫికేట్‌ ఆడుగుతారా? అన్నట్లు సిబ్బందిపై అరిచి గొడవకు దిగింది. ఇది ప్రభుత్వం విధించిన తప్పనిసరి నిబంధన అని సిబ్బంది ఎంత చెప్పినా ఆమె పట్టించుకోలేదు.

తాను ఓ సామాజిక కార్యకర్తను అని చెబుతూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఒమర్ ఆర్ ఖురైషి అనే వ్యక్తి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ఆ మహిళా కస్టమర్‌ ప్రవర్తించిన తీరుపై కామెంట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు