షాకింగ్‌: కొత్త ఇంట్లోకి వెళ్లిన 14 గంటల్లోనే అగ్ని ప్రమాదం

2 Jun, 2021 20:53 IST|Sakshi

చనిపోయేలోపు సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. ఇక ఎంతో కష్టపడి.. తమ అభిరుచికి అనుగుణంగా నిర్మించుకున్న కలల సౌధంలో ప్రవేశించిన తర్వాత కలిగే సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇక్కడ మనం చెప్పుకోబోయే మహిళ కూడా అలానే సంతోషించింది. రూపాయి రూపాయి కూడబెట్టి.. ఓ అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ తీసుకుంది. నూతన ఇంటిలోకి మారింది. 

అయితే ఆ సంతోషం కనీసం ఒక్క రోజు కూడా నిలవలేదు. ఇష్టంగా కొనుకున్న కొత్త ఇంటిలో ప్రవేశించిన 14 గంటల వ్యవధిలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనతో సదరు మహిళ నిరాశకు గురయ్యింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో నెటిజనులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 

టిక్‌టాక్‌ యూజర్‌ ఎస్‌వై సిడాక్స్‌ తన అకౌంట్‌లో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. దీనిలో ఫర్నిచర్‌తో అలంకరించిన డ్రాయింగ్‌ రూమ్‌ కనిపిస్తుంది. ‘లెట్స్ స్టే హోమ్’ అనే కోటేషన్‌ ఉన్న ప్రకాశవంతమైన నియాన్ పింక్ గుర్తు గోడపై వేలాడుతూ ఉంటుంది. మరొక ఫోటోలో ఆమె పెంపుడు కుక్క తన మంచం మీద పడుకున్నట్లు ఉంటుంది. ఇవి రెండు ప్రమాదం జరగడానికి ముందు తీసిన ఫోటోలు.

ఆమె అపార్ట్మెంట్లోకి మారిన పద్నాలుగు గంటల తరువాత, నియాన్ గుర్తులో మంటలు చెలరేగాయి. నిప్పు రవ్వలు మంచం మీద పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీని వల్ల మంచం కాలిపోవడమే కాక.. కొత్త ఇంటి గోడ మీద పెద్ద రంధ్రం ఏర్పడింది. అంతేకాక స్ప్రింక్లర్‌ వ్యవస్థ దెబ్బ తినడంతో ఆమె ఇల్లంతా నీటితో నిండిపోవడం వీడియోలో చూడవచ్చు. 

చదవండి: రెండు కిలోమీటర్ల మేర రాజుకున్న అగ్గి

A post shared by Fail Salad (@failsalad)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు