యాపిల్‌ ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే యాపిల్‌ జ్యూస్‌!

2 Mar, 2021 14:35 IST|Sakshi

బీజింగ్‌: ఏ చిన్న వస్తువుకైనా ఆన్‌లైన​ మీద ఆధారపడటం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఒక్క క్లిక్కుతో మనం కోరిన వస్తువు ఇంటి ముందుకొచ్చేస్తోంది. కానీ ఒక్కోసారి మనం ఆర్డర్‌ చేసిన దానికి బదులు మరో వస్తువు పార్శిల్‌లో ప్రత్యక్షమవుతుంది. దాన్ని రిటర్న్‌ తీసుకుని మనం అడిగింది రీప్లేస్‌ చేస్తే సరేసరి, కాదూ, కూడదని చేతులెత్తేస్తేనే అసలు సమస్య! తాజాగా చైనాకు చెందిన లియు అనే యువతి ఆపిల్‌ ఐఫోన్‌ 12 ప్రో మాక్స్‌ ఆర్డర్‌ చేసింది. ఆన్‌లైన్‌లోనే 1500 డాలర్లు(భారత కరెన్సీలో రూ.1,10,231) బిల్లు కూడా చెల్లించింది. ఫోన్‌ ఎప్పుడు చేతికొస్తుందా? అని ఆరాటంగా ఎదురుచూస్తుండగా ఆ రోజు రానే వచ్చింది. ఆమె ఇంటి ముందు పార్శిల్‌ లాకర్‌లో డెలివరీ బాయ్‌ ఓ బాక్స్‌ను ఉంచి వెళ్లిపోయాడు.

తర్వాత దాన్ని ఎంతో ఆతృతగా ఓపెన్‌ చేసిన లియుకు లోపల యాపిల్‌ జ్యూస్‌ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌ తింది. యాపిల్‌ ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే యాపిల్‌ ఫ్లేవర్‌డ్‌ డ్రింక్‌‌ రావడమేంటని మండిపడింది. యాపిల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ చేసినప్పటికీ ఇలా జరిగిందేంటని వాపోయింది.. తనకు జరిగిన అన్యాయం గురించి ఆమె మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై యాపిల్‌తో పాటు ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌ సర్వీసెస్‌ స్పందిస్తూ కస్టమర్‌ చెప్పిన ప్రదేశానికి ఫోన్‌ను ఆర్డర్‌ చేశామని పేర్కొన్నాయి. దీంతో డెలివరీలో ఏ పొరపాటు జరిగి ఉండకపోవచ్చని, కానీ ఆమె ఇంటి ముందు పార్శిల్‌ లాకర్‌లో పెట్టిన తర్వాత దుండగులు ఎవరైనా దాన్ని మార్చేసి ఉండొచ్చేని భావిస్తున్నారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఐఫోన్‌ ఎలా మాయమైందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. యాపిల్‌ కూడా ఈ విషయంపై విచారణ చేపడుతున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది.

చదవండి: గే తమ్ముడి దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన అక్క

కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ డ్రైవర్‌ దీన గాథ

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు