నీటిలో అబ్బురపరిచే డ్యాన్స్‌ విన్యాసం.. ‘వారెవ్వా’ అనాల్సిందే

26 Jul, 2021 17:51 IST|Sakshi

డ్యాన్స్‌ చాలా మందికి పిచ్చి. దాన్ని ఒక ఫ్యాషన్‌లా ఫీల్‌ అవుతూ ప్రాణాలను పణంగా పెట్టి చేస్తుంటారు. నాట్యంలో కొత్త మెలుకువలు నేర్చుకుంటూ తమ టాలెంట్‌ను నిరూపించుకుంటారు. తమ విన్యాసాలతో అందరి చేత శభాష్‌ అనిపించుకునేందుకు తహతహలాడుతుంటారు. అయితే ఇప్పటి వరకు ఫ్లోర్‌, బ్రేక్‌, హిప్‌ అప్‌, ఫోక్‌ వంటి వెరైటీ డ్యాన్‌లు చూసే ఉంటాం. అలాగే నేల మీద, తాడులతో వేలాడుతూ గాల్లో చేసే డ్యాన్‌లు కూడా తెలుసు. కానీ నీళ్లలో డ్యాన్స్‌ చేయడం చూశారా.. చాలా తక్కువ మంది ఇలా ప్రయత్నిస్తుంటారు.

తాజాగా ఓ జిమ్నాసిస్ట్‌ నీటి లోపల డ్యాన్స్‌ చేస్తూ ఎంతో మందిని అబ్బురపరిచింది. ఫ్లోరిడాలోని మయామికి చెందిన  క్రిస్టినా మకుషెంకో అనేమహిళ నీటి లోపల అద్భుతమైన స్టెప్పులతో చేస్తున్న డ్యాన్స్‌ విన్యాసం పలువురిని ఆకట్టుకుంటోంది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజనులు సర్‌ఫ్రైజ్‌కు గురవుతున్నారు. మకుషెంకో నీటి లోపల చేసిన డ్యాన్స్‌ ప్రతిభను చాలా మంది ప్రశంసించారు. ‘మీరు అద్భుతంగా చేస్తున్నారు. ఇది మాకెంతో నచ్చింది. వారెవ్వా సూపర్‌’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ​కాగా అమెరికాకు చెందిన 26 ఏళ్ల క్రిస్టినా మకుషెంకో అంతర్జాతీయ స్విమ్మర్‌. 2011 లో యూరోపియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు కూడా సాధించారు. ఆ తరువాత ఆమె ఈతల పోటీల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించారు.

A post shared by Kristina Makushenko (@kristimakusha)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు