-

A Woman Pulls Van: జుట్టుతో లాగేస్తోంది.. ఇది చమురు ధరల ఎఫెక్టేనా?

12 Oct, 2021 12:41 IST|Sakshi

ఆమె ఏం షాంపు వాడుతుందో గానీ ఆమె కురులతో వ్యాన్‌ లాక్కెళ్లిపోతుంది

లండన్‌: మనం టీవిలో అడ్వర్టైస్‌మెంట్‌లలో చూసు ఉంటాం మీ కురులు ధృడంగా ఉండాలంటే అంటూ ఒకామె తన జుట్టుతో కారుల్ని లాక్కుపోతున్నట్లు చూపిస్తారు. పైగా ఈ షాంపు వాడితే మీ కురులు అంత ధృడంగా అవుతాయంటూ పలు అడ్వర్టైస్‌మెంట్‌లు చూశాం గానీ నిజమైన అనుభవం ఎవరికీ ఎదురై ఉండదు కదూ...కానీ లండన్‌కి చెందిన  అనస్తాసియా అనే మహిళ ఇలాంటి విన్యాసం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

(చదవండి: ప్రవాసి దుర్గా మాతలు)

వివరాల్లోకెళ్లితే అనస్తాసియా అనే మహిళ ఒక పెట్రోల్‌ బంక్‌ వద్ద తన కురులతో వ్యాన్‌ని లాక్కెళ్లిపోతుంది. అసలే పెట్రోల్‌ సంక్షోభంతో దేశాన్ని సతమతమవుతుంటే ఆమె చేసిన ఈ ఫీట్‌కి అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. ఇది చమురు కొరత తెలియజెప్పటం కోసం ఇలా చేస్తుందని కొందరూ భావించారు.  ఇది పెట్రోల్‌ ధరల ఎఫెక్టేనా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. కానీ వాస్తవానికి అనస్తాసియా అందుకోసం ఈ విధంగా చేయలేదు. ఆమె ఒక ప్రఫెషనల్‌ 'హెయిర్-హాంగ్ ఏరియలిస్ట్'. ఆమె సర్కస్‌ వృత్తిలో భాగంగా ఈ ఫీట్‌ చేస్తుంది.

ఆమె కురులతో ఈ విన్యాసలు చేయడం కోసం చదువును కూడా మధ్యలోనే వదిలేసింది. ఆమె ఎక్కువ సమయం ఎయిర్‌కి సంబంధించిన రకరకాల విన్యాసలతోనే గడుపుతుందట. ఈ మేరకు అనస్తాసియా మాట్లాడుతూ.....ఈ విన్యాసలు చేయడం చాలా కష్టం. నాకు కురులతో వ్యానులు లాగినపుడు చాలా నొప్పిగా అనిపిస్తోంది. ఈ విన్యాసం చూడటానికి ఆశ్యర్యం కలిగించినప్పటికీ చాలా కష్ట నష్టాలకి ఓర్చుకోవాలి. నేను రోజు రెండు బాటిళ్ల కండిషనర్‌ని వాడటం వల్లే నా కురులు ఇంతా బలంగా ధృడంగా ఉన్నాయి" అని చెబుతోంది. 

(చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్‌ డాలర్లు!)

మరిన్ని వార్తలు