3.8 బిలియన్ డాలర్ల వస్తువులు కొట్టేసి..

6 Oct, 2020 19:43 IST|Sakshi

మనిషికి డబ్బు ఆశ ఉండడం సహజం. అది ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో బయటికి వస్తుంది. కొందరు కష్టపడి డబ్బు సంపాదించాలనుకుంటే.. మరికొంతమంది అడ్డదారుల్లో సంపాదించాలని చూస్తారు. దీంట్లో కొంతమంది సక్సెస్‌ చూస్తారు.. ఓటములు చూస్తారు. కానీ అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 63 ఏళ్ల కిమ్‌ రిచర్డ్‌సన్‌ మాత్రం 19 ఏళ్లుగా సక్సెస్‌ను మాత్రమే చూస్తు వచ్చింది. ఆమె కేవలం కొట్టేసిన వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్మేయడం ద్వారా కోట్లను కొల్లగొట్టింది. ఇంతకీ ఆమె కొట్టేసిన వస్తువుల విలువ ఎంతో తెలుసా.. అక్షరాల 3.8 బిలియన్‌ డాలర్లు. (చదవండి : వామ్మో ! పొడవంటే పొడువు కాదు..)

ఇక అసలు విషయంలోకి వెళితే.. కిమ్‌ రిచర్డ్‌సన్‌ తనకు కావాల్సిన వస్తువులను కొట్టేయడంలో ఆరితేరిన వ్యక్తి. ఒకషాపులోకి వెళ్లిందంటే ఎదుట ఎలాంటి సీసీ కెమెరాలు ఉన్నా వాటి నుంచి చాకచక్యంగా తప్పించుకొని తనకు కావాల్సిన వస్తువులను కొట్టేసేది. 44 ఏళ్ల వయసులో దొంగతనాలు చేయడం ప్రారంభించిన రిచర్డ్‌సన్‌ 2000 ఆగష్టు నుంచి 2019 వరకు 19 ఏళ్లపాటు అమెరికాలోని అనేక స్టోర్స్ లోని వస్తువులను కొట్టేసింది. ఒకటి,రెండు సంవత్సరాలు కాదు.. ఏకంగా 19 ఏళ్లలో 3.8 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొట్టేసింది. అలా కొట్టేసిన వస్తువులను ఈబేలో అమ్మకానికి పెట్టి దానికి రెట్టింపు సంపాదించేది. (చదవండి : అక్కడ 36 వేల మందికి ప్రాణాపాయం!)

అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. ఇటీవలే రిచర్డ్‌సన్‌ చేసిన దొంగతనాలను పోలీసులు పసిగట్టారు. పెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వస్టిగేషన్‌తో రిచర్డ్‌సన్‌పై సీక్రెట్‌గా విచారణ చేయించగా ఆమె చేసిన పనులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. కాగా రిచర్డ్‌సన్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిచర్డ్‌సన్‌కు 54 నెలల పాటు జైలు శిక్ష విధించడంతో పాటు 3.8 మిలియన్‌ డాలర్లు (ఇండియన్‌ కరెన్సీలో రూ.27 కోట్ల ) జరిమానా వేసింది.

మరిన్ని వార్తలు