అఫ్గాన్‌: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు

9 Sep, 2021 20:40 IST|Sakshi

మహిళలు సగభాగంగా గుర్తించమని వ్యాఖ్య

ఓ మీడియాతో తాలిబన్‌ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానమంత్రిగా ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ పరిపాలన మొదలైంది. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటుచేశారు. అయితే ఆ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా తాలిబన్లకు వ్యతిరేకంగా బుధవారం మహిళలు నిరసన చేపట్టారు. మంత్రివర్గంలో మహిళ అంశంతో పాటు నిన్న జరిగిన మహిళల ప్రదర్శనపై తాలిబన్ల ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలపై అతడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
చదవండి: తాలిబన్ల అరాచకం.. జర్నలిస్టులకు చిత్రహింసలు

‘మంత్రులుగా మహిళలు పనికి రారు.. వాళ్లు కేవలం జన్మనివ్వడానికే పరిమితం’ అని పేర్కొన్నాడు. తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హషిమి ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘మహిళలు మంత్రులు కాలేరు. ఆమె మెడపై ఏమైనా వస్తువు పెడితే వారు మోయలేరు. మంత్రివర్గంలో మంత్రులు తప్పనిసరి కాదు’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నిన్న మహిళల నిరసన ప్రదర్శనపై అతడు స్పందిస్తూ ‘ఆ నలుగురు మహిళల నిరసన అఫ్గానిస్తాన్‌ మొత్తం మహిళలు ప్రాతినిథ్యం వహించినట్టుగా భావించొద్దు’.
చదవండి: పెళ్లి చేసుకోవాల్సిన ఈ వధూవరులు ఏం చేస్తున్నారో తెలుసా?

‘మహిళలకు స్వేచ్ఛనిస్తే ఏం జరుగుతుందో మీకో ఉదాహరణ చెబుతా. రెండు దశాబ్దాలుగా కీలుబొమ్మ పరిపాలన కొనసాగలేదా’ అని ఎదురు ప్రశ్నించాడు. వ్యభిచారం బాగా పెరిగిపోయింది. కార్యాలయాల్లోనే ఏకంగా ఆ వ్యవహారం కొనసాగుతోంది. మహిళలు జనాభాలో సగభాగమని యాంకర్‌ తెలపగా వారు సగభాగమని మేం భావించాం’ అని జెక్రుల్లా స్పష్టం చేశాడు. మహిళలు అఫ్గానిస్తాన్‌ ప్రజలను జన్మనివ్వడానికే పరిమితం కావాలి’ అని పేర్కొన్నాడు.
 

మరిన్ని వార్తలు