వరదలో చిక్కిన మహిళ.. ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని..

5 Jun, 2021 15:03 IST|Sakshi
వీడియో దృశ్యాలు

టెక్సాస్‌ : వరదలో చిక్కుకుని అల్లాడిపోతున్న ఓ మహిళను సహాయక సిబ్బంది ఒకరు ప్రాణాలకు తెగించి రక్షించారు. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. మే 24న టెక్సాస్‌లో భారీ వర్షం కురిసింది. ఫోర్ట్‌ వర్త్‌ ఏరియా మొత్తం జలమయమయ్యింది. ఆ సమయంలో కారులో వెళుతున్న ఓ మహిళ వరదలో చిక్కుకుపోయింది. అయినప్పటికి కారును నడపటానికి ప్రయత్నించటంతో కారు వరదలో కొట్టుకుపోయింది. కారులో చిక్కుకున్న ఆమె కొద్దిసేపటి తర్వాత బయట పడింది. అలా నీటిలో కొట్టుకుపోతూ ఓ చోట చెట్టు కొమ్మను పట్టుకుంది.

ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని చాలా సేపటి వరకు వరద నీటిలో ఉండిపోయింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సిబ్బందిలోని ఒకరు ప్రాణాలకు తెగించి ఆమె కోసం వరదలోకి దిగాడు. ఆమెకు లైఫ్‌ జాకెట్‌ తొడిగించి, బయటకు తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి : వైద్య సిబ్బంది సాహసం: వ్యాక్సిన్‌ కోసం నది దాటి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు