టాయ్‌లెట్‌లో నాలుగ‌డుగుల పాము

5 Aug, 2020 15:24 IST|Sakshi

కొల‌రాడో: అమెరికాలోని ఓ మ‌హిళ‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. టాయ్‌లెట్‌లో పాము క‌నిపించ‌డంతో గుండె ఆగినంత ప‌నైంది. కొల‌రాడోకు చెందిన మిరాండా స్టీవార్ట్ గ‌త‌ బుధ‌వారం త‌న బాత్రూం గ‌దిలోకి వెళ్లింది.  టాయ్‌లెట్‌కి వెళ్లిందో లేదో టాయ్‌లెట్ సీట్లోంచి ఏదో శ‌బ్ధం వినిపించింది. ఏమిటా అని ద‌గ్గ‌ర‌కు మొహం పెట్టి చూసేస‌రికి అక్క‌డ బుస‌లు కొడుతూ పాము త‌ల పైకెత్తి చూడటంతో ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. వెంట‌నే గావుకేక‌తో త‌న బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచి అపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసే వ్య‌క్తిని పిలుచుకుర‌మ్మంది. అనంత‌రం ఆ గ‌ది నుంచి బ‌య‌ట‌కు ప‌రుగెత్తుకొచ్చింది. మ‌రోవైపు ఆ సిబ్బంది వెంట‌నే బాత్రూంలోకి చేరుకుని టాయ్‌లెట్ సీటులో ఉన్న పామును బ‌య‌ట‌కు తీశాడు. (అర్జంట్ బాత్రూం: 185 కిమీ వేగంతో)

అది సుమారు నాలుగు అడుగుల పొడ‌వుంది. కెమెరాలో బంధించిన పాము ఫొటోల‌ను స్టీవార్ట్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. "నా జీవితంలో ఇంత‌గా ఎప్పుడు భ‌య‌ప‌డ‌లేదు" అని చెప్పుకొచ్చింది. అయితే అది విష‌‌స‌ర్పం కాక‌పోవ‌డంతో పామును ప‌ట్టుకున్న సాన్‌ఫోర్డ్ దాన్ని పెంచుకునేందుకు ముందుకు వ‌చ్చాడు. సాన్‌ఫోర్డ్ దంప‌తులు ఆ పాముకు "బూట్స్" అని నామ‌క‌ర‌ణం చేసి ఎంచ‌క్కా ఇంటికి తీసుకు వెళ్లారు. (ప్యాంటులో పాము, రాత్రంతా జాగారం)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు