బాబోయ్‌.. అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్‌!

8 Apr, 2021 17:10 IST|Sakshi

ముప్పై ఏళ్ల తర్వాత గోళ్లు కత్తిరించిన మహిళ

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న వీడియో

వాషింగ్టన్‌: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని సామెత. దీనికి తగ్గట్లుగానే మనుషులకు రకరకాల ఆసక్తులుంటాయి. కొన్ని వినడానికి.. చూడటానికి బాగుంటాయి. కొందరు ఆసక్తులు గమనిస్తే.. బాబోయ్‌ ఇదేం పిచ్చి అనిపిస్తుంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన వారంతా వీడియోలో ఉన్న మహిళను అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్‌ అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఆ మహిళ ఆసక్తి ఏంటి.. ఎందుకు ఆమెని ఇలా ప్రశ్నస్తున్నారో తెలియాలంటే ఇది చదవాల్సిందే. 

అమెరికాకు చెందిన అయాన్న విలియమ్స్‌కు చేతి వేలి గోర్లు పెంచడం ఆసక్తి. మీరు చదివింది నిజమే. నెయిల్స్‌ పెంచడం అంటే ఇమెకు ఎంత పిచ్చి అంటే గత ముప్పై ఏళ్లుగా ఒక్క​ సారి కూడా తన చేతి గోళ్లను కత్తిరించలేదు. సాధారణంగా వారం రోజుల పాటు నెయిల్స్‌ కట్‌ చేయకుంటేనే పొడవుగా పెరుగుతాయి. అలాంటిది ముప్పై ఏళ్లుగా గోళ్లను కట్‌ చేయకపోతే ఇక అవి ఏ రేంజ్‌లో పెరిగి ఉంటాయో మీరే ఊహించుకోండి. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం అనగా 2017లో అయాన్న విలియమ్స్‌ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోర్లు కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డులోకి కూడా ఎక్కింది. 

ఇప్పుడు ఈ మహిళ వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే.. కొద్ది రోజుల క్రితం అయాన్న తన గోర్లను కట్‌ చేసింది. 28 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా పెంచిన గోళ్లను కట్‌ చేసింది. దీనికి ముందు ఆమె నెయిల్స్‌ సైజును మరోసారి కొలిచారు. 2017తో పోలిస్తే.. అయాన్న గోళ్ల  పొడవు ఇప్పుడు మరింత పెరిగింది. దాంతో ఆమె తన రికార్డును తానే అధిగమించింది. ప్రస్తుతం అయాన్న గోళ్లు 24.07 పీట్స్‌ పొడవున్నాయి. ఎలక్ట్రిక్‌ కట్టర్‌తో అయాన్న గోళ్లను కత్తిరించారు. ఈ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

ఈ సందర్భంగా అయాన్న మాట్లాడుతూ.. ‘‘దాదాపు గత 3 దశాబ్దాలుగా నేను నా చేతి వేలి గోళ్లను కాపాడుకుంటూ వచ్చాను. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వీటిని పెంచాను. కానీ ఇప్పుడు మారాల్సిన సమయం వచ్చింది. అందుకే వాటిని కత్తిరించాను’’ అని తెలిపారు. ఇక అయాన్న గోర్లు చూసిన వారంతా అసలు ఇంత కాలం నీవ్వు ఇంటి పనులు ఎలా చేసుకున్నావ్‌.. ఇంత పెద్ద గోర్లతో తల దువ్వుకోవడం.. ఇంటిని శుభ్రపర్చడం.. గిన్నెలు తోమడం, బట్టలుతకడం వంటి పనులు ఎలా చేశావ్‌.. ఈ పనులన్నింటికి ఇబ్బంది పడుతూ నువ్వు ఎలా బతికావ్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు. 

చదవండి: 13 గిన్నిస్‌లు సాధించిన హైదరాబాద్‌ యువతి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు