కమల హ్యారీస్‌ హత్య కుట్ర భగ్నం: రూ.40 లక్షలకు ఒప్పందం

16 Sep, 2021 21:06 IST|Sakshi

ఐదేళ్ల జైలు శిక్ష విధించిన మియామి ఫెడరల్‌ కోర్టు

వీడియోల సందేశాలతో కుట్రను బహిర్గతం చేసిన నిఘా వర్గాలు

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌ హత్యకు కుట్ర పన్నింది ఓ మహిళ. అయితే చివరకు ఆమె కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను జైలుకు పంపించారు. ఈ వార్త అమెరికాలో కలకలం రేపింది. అయితే కమలా హత్యకు ఆమె ఏకంగా దాదాపు అరకోటి వరకు సుపారీ తీసుకుంది. కమలా హత్యకు కుట్రకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. నిందితురాలిని మియామి ఫెడరల్‌ కోర్టులో హాజరుపరచగా పలు విస్తుగొల్పే విషయాలు వెల్లడయ్యాయి.
చదవండి: కొత్త ట్విస్ట్‌.. ‘ఆ బిడ్డ నాకు పుట్టలేదు! డీఎన్‌ఏ టెస్ట్‌ చేయండి’

దక్షిణ ఫ్లోరిడాకు చెందిన మహిళ నివియన్‌ పెటిట్‌ ఫెల్ప్స్‌ (39) ఫిబ్రవరిలో కమల హత్యకు కుట్ర పన్నింది. 53 వేల డాలర్ల (సుమారు రూ.39 లక్షలు)కు కమలను హత్య చేసేందుకు ఆమె ఒకరితో ఒప్పందం కుదుర్చుకుంది. 50 రోజుల్లోనే ఆమెను హత్య చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే ఆ విషయాలను మాట్లాడుతూ వీడియో తీసుకుంది. అయితే ఆ వీడియోను ఇతరులకు పంపడం ఆమె చేసిన పెద్ద తప్పిదం. దీంతో ఆమె కుట్ర నిఘా వర్గాలకు తెలిసిపోయింది. నిఘా వర్గాలు ఆ వీడియోను పరిశీలించిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మియామీ న్యాయస్థానంలో నిందితురాలిని హాజరుపరిచారు. కమల హ్యారీస్‌ను హత్య చేస్తానని ఆరుసార్లు హెచ్చరికలు పంపింది. కమల హత్యకు ఆమె తుపాకీ లైసెన్స్‌ అనుమతికి దరఖాస్తు చేసుకున్నది కూడా. ఈ కేసులో విచారణ అనంతరం నివియన్‌కు ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 
చదవండి: బెడ్రూమ్‌లోకి వెళ్తే వద్దంటుండు: భర్తపై భార్య ఫిర్యాదు


హత్యకు కుట్ర పన్నిన మహిళ నివియన్‌ పెటిట్‌ ఫెల్ప్స్‌

మరిన్ని వార్తలు