''గతిలేని సంసారం చేస్తాగానీ..ఇలా సుతిలేని సంసారం చేయలేను"

4 Jul, 2021 05:53 IST|Sakshi

కాన్‌బెర్రా: "గతిలేని సంసారం చేస్తాగానీ ఇలా సుతిలేని సంసారం చేయలేనంటూ" ఓ భార‍్య తన భర్తకు విడాకులిచ్చింది. ప్రస్తుతం ఈ విడాకుల ఉదంతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఫీస్‌ అయినా, ఇల్లైనా జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే కరోనా వైరస్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు బలికావాల్సి వస్తుంది. కానీ ఓ భర్త ఇంటి వాతావరణాన్ని స్పాయిల్‌ చేస్తున్నాడని, పిల్లల్ని పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ భార్య విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కింది.

ఆస్ట్రేలియాకు చెందిన సోఫియా, చెరిల్ లు భార్య భర్తలు. భార‍్య సోఫియా ఇంట్లో బండెడు చాకిరితో  గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తుంది. అయితే ఓ రోజు ఆమె ఉన్నట్లుండి ఆస్పత్రి పాలైంది. నిమోనియా కారణంగా మూడోరోజులు ఆస‍్పత్రిలో ట్రీట్మెంట్‌ తీసుకుంది. మూడురోజుల తరువాత ఆరోగ్యం కుదుట పడకపోయినా తన ఇద్దరు కొడుకులపై ఉన్న బెంగతో ఆస్పత్రి నుంచి డిచ్చార్జ్‌ అయ్యింది. ఇంటికి వచ్చే సరికి.. భర్త చెరిల్‌ ఇల్లును గుల్లు చేసేశాడు. ఇంటి నిండా సిగరెట్ పీకలు, కార‍్లో పిస్తా పలుకులు, మూడురోజుల నుంచి డైపర్లు మార్చలేదు. దీంతో భర్త చెరిల్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకులకు అప్లయ్‌ చేసింది. ఆ విడాకుల గురించి నెటిజన్లతో పంచుకుంది. 

ఆస్పత్రి నుంచి ఇంటి వచ్చే సరికి భర్త చెరిల్‌ పీకలు పీకలు సిగరెట్లు కాల్చి ఇంటిఫ్లోర్‌ పైనే పడేశాడు. డైపర్లు మార్చలేదు. నేను ఆస్పత్రికి వెళ్లే ముందు  పిల్లలకు డైపర్లు మార్చి వాళ్లని జాగ్రత్తగా చూసుకోమని చెరిల్‌కి చెప్పా. కానీ ఏం చేశాడు లైట్‌ తీసుకున్నాడు. భర్త నిర్లక్ష్యం వల్ల పిల్లలికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అనారోగ్యం వల్ల వాళ్లకి జరగరానిది ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటీ? సుచీశుభ్రత ఉండదు. వారంలో ఒక్కరోజన్న తనతో,పిల్లలతో టైమ్‌ స్పెండ్‌ చేయమని ప్రాధేయపడినా పట్టించుకోడు.  మరి ఇలాంటి భర్తతో గడపడం నావల్ల కాదు అందుకే విడాకులు కోరుకుంటున్నట్లు చెప్పింది. 

మరిన్ని వార్తలు