వ్యాక్సిన్‌ వేయించుకుంది.. రూ 7.4 కోట్లు గెలుచుకుంది

8 Nov, 2021 10:08 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ వ్యాక్సిన్‌లు తీసుకునేలా అధికారులు రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా తమ దేశంలోని ప్రజలంతా వ్యాక్సిన్‌లు వేయించుకునేలా రకరకాల కార్యక్రమాలతో పాటు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది.

(చదవండి: అక్తర్‌కు పరువు నష్టం నోటీస్‌.. భజ్జీతో కనిపించినందుకే!)

ఈ మేరకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటే ఉచితంగా బీర్‌లు, ఆహారపదార్థాలు, లాటరీ వంటి టికెట్లను ఇస్తామంటూ రకకరాల ప్రోత్సహాకాలను అందించింది. అంతేకాదు ప్రజలందరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రోత్సహించే నిమిత్తం ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రవేట్‌ కంపెనీలు ఒక మిలియన్ డాలర్ వ్యాక్స్ అలయన్స్ లాటరీని రూపొందించారు. ఇది ప్రజలనుంచి విశేష స్పందన వచ్చింది.

పైగా దాదాపు 30 లక్షల మంది ప్రజలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవటమే కాక ఈ లక్కీ డ్రాలో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. అయితే చివరికి ఈ లక్కీ డ్రాని 25 ఏళ్ల ఝూ గెలుచుకంది. సదరు లక్కీ డ్రా అధికారులు చెప్పేంత వరకు ఆమెకు తెలియదు. దీంతో ఆమె ఈ డబ్బులో కొంత భాగం తమ కుటుంబ సభ్యుల కోసం వెచ్చించడమే కాక మిగిలి డబ్బుని భవిష్యత్తు అవసరాల కోసం ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

(చదవండి: దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం)

మరిన్ని వార్తలు