అఫ్గన్‌కు 60 కోట్ల డాలర్ల సాయం చేయండి: ఐరాస

14 Sep, 2021 04:14 IST|Sakshi

ప్రపంచ దేశాలను కోరిన ఐరాస

జెనీవా: తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌ను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించా ల్సిందిగా సోమవారం ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితి(ఐరాస) కోరింది. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు అఫ్గన్‌ ప్రజల కష్టాలు తీర్చేందుకు 60.6 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,463 కోట్లు) సాయం చేసి ప్రపంచ దేశాలు తమ మానవతా దృక్పథాన్ని మరోసారి చాటాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ హితవు పలికారు. సోమవారం జెనీవాలో జరిగిన విరాళాల సేక రణ సదస్సులో ఆయన మాట్లాడారు. అఫ్గన్‌ పేదలకు సాయపడాలన్నారు. ఐక్యరాజ్య సమితి అత్యవసర విభాగం తరఫున  2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు సదస్సులో గుటెర్రస్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు