longest car: ప్రపంచంలోనే అతి పొడవైన కారుగా...వరల్డ్‌ రికార్డు

11 Mar, 2022 11:22 IST|Sakshi

Worlds Longest Car Break Its Own Record Over 100 Feet Long: ఎవరు చేయని వాటిని రూపొందించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం దక్కించుకున్నవాళ్లు కోకొల్లలు. కానీ అవి ఉపయోగపడేవే అయితే సమస్య లేదు. నిరూపయోగంగా మారితేనే బాధ అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తొలుత 60 అడుగుల పెద్ద కారు రూపొందించి గిన్నిస్‌ రికార్డు సాధించాడు. ఆ తర్వాత ఇంకాస్త ముందడుగు వేసి ఏకంగా 100 అడుగుల కారుని రూపొందించి తన రికార్డుని తానే తిరగరాశాడు. కానీ ఈ తర్వాత నుంచే ఆ కారు నిర్వహణకు సంబంధించిన సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఆ కారు ఏమైందో తెలుసా!

వివరాల్లోకెళ్తే...ప్రపంచంలోనే అ‍త్యంత పొడవైన కారుగా గతంలో ఉన్న ఆ కారు రికార్డును అదే బ్రేక్‌ చేసింది. ఈ కారు సుమారు 100 అడుగుల పొడవు. అమెరికన్‌ డ్రీమ్‌గా పిలిచే లియోసిన్‌ అనే ఈ కారుని జే ఓర్‌బెర్గ్‌ రూపొందించాడు. అతను 1986లో 60 అడగులు పొడవు గల కారుని రూపొందించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత మళ్లీ ఆ రికార్డుని బ్రేక్‌ చేసేలా దాదాపు 100 అడుగుల కారుని రూపొందించాడు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఈ కారుని ప్రంపచంలోనే అత్యంత పొడవైన కారుగా గుర్తించింది కూడా.

అంతేకాదు ఈ కారు సుమారు 10 టాటా నానోల వెనుక వరుసల ఉంచితే ఉండేంత పొడవు. అయితే ఆ తర్వాత ఆ కారు నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారింది. దీంతో ఆ కారుని న్యూజెర్సీ వేర్‌హౌస్‌లో ఉంచారు. పైగా ఈ కారున అద్దెకు తీసుకోవడం ఆర్థికపరంగా పెద్ద సమస్యగా మారింది. అయితే న్యూయార్క్‌లోని నాసావు కౌంటీలో ఆటోసియం టెక్నికల్ టీచింగ్ మ్యూజియం యజమాని మైఖేల్ మానింగ్‌ ఈ కారుని లీజు తీసుకుని నిర్వహించేవాడు. అయితే అతను లీజు ముగిసేనాటికి కారులో ఉన్న పలు భాగాలు తిరిగి బాగు చేసేందుకు వీలు లేనంతగా పాడవటంతో మానింగ్‌ కారుని eBay జాబితా చేసింది.

కానీ మానింగ్‌ అనూహ్యంగా ఓర్‌బర్గ్‌తో మళ్లీ ఒప్పందం చేసుకుని ఆ కారుని తీసుకున్నాడు. ఈ క్రమంలో ప్లోరిడాలోని పర్యాటక ఆకర్షణ కలిగి ఉన్న ఓర్లాండోలో డెజర్‌ల్యాండ్ పార్క్ కార్ మ్యూజియం యజమాని మైఖేల్ డెజర్ 2019లో ఈ కారుని కొనగోలు చేశాడు. ఆ తర్వాత అతను మానింగ్‌తో కలసి ఈ కారుని అత్యాధునికంగా పునరుద్ధరించాడు. దీంతో ఇప్పుడూ ఈ అతిపెద్ద కారులో 75 మందికి సరిపడ హెలిప్యాడ్, డైవింగ్ బోర్డ్‌తో సహా స్విమ్మింగ్ పూల్, వంటి అత్యాధునిక వసతులు అన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు ఆ పార్క్‌లో అత్యధిక సంఖ్యలో పర్యాటకుల కొలువుదీరేలా ప్రధాన ఆక్షర్షణ ఉంది

( చదవండి: ఆ విమానంలో ఆమె మాత్రమే ప్రయాణికురాలు)

మరిన్ని వార్తలు