ఏడాదిగా షాప్‌కి వస్తున్న ప్రమాదకరమైన పక్షి!

27 Nov, 2021 16:17 IST|Sakshi

కొన్ని భయంకరమైన జంతువులను దూరం నుంచి చూడటమో లేక టీవీల్లో చూడటమో చేస్తాం. కానీ వాటిని నేరుగా చూడాలని  అనుకోము. కానీ ఇక్కడొక వ్యక్తి షాపుకి ప్రపంచంలోనే అ‍త్యంత ప్రమాదకరమైన పక్షి ఒకటి ప్రతిరోజు వస్తోందట.

(చదవండి: ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం)

అసలు విషయంలోకెళ్లితే... ఆస్ట్రేలియాలో ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని జులటెన్‌ నివశిస్తున్న టోనీ ఫ్లెమింగ్‌ అనే వ్యక్తి వడ్రంగి షాపుకి ఒక ప్రమాదకరమైన కాసోవరి అనే పక్షి రోజు వస్తోందట. పైగా ఈ కాసోవరి పక్షి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి మాత్రమే కాదు చాలా శక్తిమంతంగా దాడిచేస్తాయి. అంతేకాదు ఈ కాసోవరి పక్షి 1.8 మీటర్ల పొడవు,  70 కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి.

పైగా వాటి గోళ్లు 10 సెం.మీ వరకు పొడవు పెరుగతాయి. అందువల్లే అది చాలా భయంకరంగా దాడిచేస్తుంది. అయితే ఈ పక్షి ఒక ఏడాది నుంచి తన షాప్‌లోకి దర్జాగా వచ్చేయడమే కాక అక్కడ ఉన్న రేగు పళ్ళను తినేసి వెళ్లిపోతుందని చెబుతున్నాడు. చాలామంది తమ చుట్టపక్కల స్నేహితులు వచ్చి ఫోటోలు తీసుకుంటారని కూడా అంటున్నాడు.  పైగా అది మా  ఇంటి ఆవరణలో సైతం తిరుగుతున్నట్లు గమనించామని, పైగా స్థానికులు దానికి పెంపుడు జంతువు మాదిరిగా ఆహారం పెడుతున్నారని చెప్పాడు.

అయితే టోనీ ఈ పక్షి "రోంపర్ స్టాంపర్" అని పేరు కూడా పెట్టాడు. కానీ ఇది స్థానికులందరితో కలిసి ఉండదని చెబుతున్నాడు. పైగా అక్కడ నగరంలో ప్రసిద్ధి గాంచిన పబ్‌లో కూడా తిరగడమే కాక అక్కడ రోడ్డుపై వెళ్లుతున్న ఒక వ్యక్తి పై దాడి కూడా చేసిందని అన్నాడు. అయితే అతను అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడినట్లు టోనీ చెప్పుకొచ్చాడు.

(చదవండి: ఆ పిల్లాడి కంటే ఈ కుక్క పిల్లే భలే మాట్లాడేస్తోంది!!!)

మరిన్ని వార్తలు