ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు

18 Nov, 2020 22:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరాలతోపాటు అత్యంత చౌక నగరాలు ఉంటాయని తెల్సిందే. ఖరీదైన నగరాల్లో మానవ జీవన వ్యయం ఎక్కువగా ఉంటే, చౌక నగరాల్లో మానవ జీవన వ్యయం తక్కువగా ఉంటుంది. అంటే ఓ మనిషి జీవించడానికయ్యే ఖర్చును జీవన వ్యయంగా పరిగణిస్తారు. అలా మానవ జీవితానికి అవసరమైన 138 వస్తువుల జాబితాలను రూపొందించి ప్రపంచంలోని 130 నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలసుకోవడం ద్వారా ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ‘ప్రపంచ దేశాల్లో జీవన వ్యయం 2020’ పేరిట ఓ సర్వే నివేదికను రూపొందించి విడుదల చేసింది. 
(చదవండి : ఏకైక శ్వేత జిరాఫీకి జీపీఎస్‌ ట్రాకర్‌)ఆ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు హాంకాంగ్, పారిస్, జూరిచ్‌ కాగా, అంతకంటే కొంచెం తక్కువ ఖరీదైన నగరాలు సింగపూర్, ఒసాకా, టెల్‌ అవీవ్, న్యూయార్క్‌. ప్రపంచంలోనే అత్యంత చౌకైన దేశం సిరియా రాజధాని డమస్కస్‌. ఆ తర్వాత ఉజ్బెకిస్థాన్‌ రాజధాని తాష్కంట్, లుసాకా, కారకాస్, ఆల్మటీ నగరాలు. ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈఐయు ఈ సర్వేను నిర్వహించింది. అమెరికా డాలర్‌పై యూరో స్విస్‌ ఫ్రాంక్‌ల విలువ పెరగడంతో అత్యంత ఖరీదైన నగరాల్లో ఐదవ స్థానంలో ఉన్న పారిస్, జూరిచ్‌ అగ్రభాగానికి చేరుకున్నాయి. కరోనా ప్రభావం వల్ల రెండు ఆసియా దేశాల్లో నిత్యావసర సరకుల ధరలు పడిపోయాయి. అలా నాలుగో స్థానంలో ఉన్న సింగపూర్, ఒసాకా ఐదవ స్థానానికి పడి పోయాయి. విదేశీ కార్మికులు సొంత దేశాలకు తిరిగి పోవడంతో సింగపూర్‌లో కాస్త ధరలు పడి పోయాయి. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు